News December 17, 2024

దేశంలో ఇప్పటికీ యువతులకు రక్షణ లేదు: నిర్భయ తల్లి

image

‘నిర్భయ’ ఘటన జరిగి 12 ఏళ్లయినా దేశంలో ఇప్పటికీ యువతులకు రక్షణ లేకుండా పోయిందని నిర్భయ తల్లి ఆశా దేవి ఆవేదన వ్యక్తం చేశారు. కఠినమైన చట్టాలు అమల్లోకి వచ్చినా పరిస్థితుల్లో మార్పు రాలేదని అన్నారు. తన కుమార్తె మరణించినప్పటికీ అలాంటి ఘటన మరోసారి జరగవద్దని తాను న్యాయ పోరాటం చేసినట్లు చెప్పారు. కోల్‌కతాలో ఇటీవల డాక్టర్ హత్యాచారానికి గురైతే, అసలు అక్కడేం జరిగిందనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదని అన్నారు.

Similar News

News January 16, 2025

రూ.1,00,00,000 ప్రశ్న.. జవాబు చెప్పగలరా?

image

‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ప్రోగ్రాంలో అమితాబ్ బచ్చన్ క్రికెట్‌కు సంబంధించి రూ.కోటి ప్రశ్న వేశారు. 1932లో లార్డ్స్‌లో భారత్ ఆడిన తన తొలి టెస్టులో మొదటి బంతి ఎదుర్కొన్న బ్యాటర్ ఎవరు? అని క్వశ్చన్ అడిగారు. A.జనార్దన్ నవ్లే B.సోరాబ్జీ కోలాహ్ C.లాల్ సింగ్ D.ఫిరోజ్ పలియా అని ఆప్షన్స్ ఇచ్చారు. మరి మీరు సరైన సమాధానం ఏంటో చెప్పగలరా? తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్: A.

News January 16, 2025

రేపు ఏపీ క్యాబినెట్ భేటీ

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఉ.11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. తల్లికి వందనం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రైతు భరోసా హామీల అమలుపై మంత్రులు చర్చించనున్నారు. అలాగే పలు కంపెనీలకు భూముల కేటాయింపునకు ఆమోద ముద్ర వేసే అవకాశమున్నట్లు సమాచారం.

News January 16, 2025

గిరిజన రైతులకు గుడ్ న్యూస్

image

TG: ‘ఇందిరమ్మ జలప్రభ స్కీమ్’లో భాగంగా గిరిజన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 100% సబ్సిడీతో సోలార్ పంపుసెట్లు ఇవ్వనుంది. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద 4 ఎకరాల్లోపు భూములు సాగు చేస్తున్న 2.30లక్షల మందికి బోరు వేసేందుకు, మోటార్‌కు అయ్యే ఖర్చును అందించనుంది. ఒక్కో రైతు యూనిట్ కాస్ట్ ₹6Lగా నిర్ణయించింది. ఈ స్కీమ్‌ దశల వారీగా అమలు కానుండగా బడ్జెట్‌లో నిధులు కేటాయించనుంది. కేంద్రం నుంచి 40% నిధులు రానున్నాయి.