News July 7, 2024
5-10 ఏళ్లలో ₹2.5లక్షల కోట్లకు జెప్టో ఆదాయం: CEO

2023 FYలో ₹2,000కోట్లుగా ఉన్న జెప్టో ఆదాయం ఏడాదిలోనే 5 రెట్లు పెరిగిందని ఆ కంపెనీ CEO ఆదిత్ పలిచా తెలిపారు. సరిగా వ్యాపారం చేస్తే ఇప్పుడున్న ₹10వేల కోట్ల ఆదాయాన్ని రాబోయే 5-10 ఏళ్లలో ₹2.5లక్షల కోట్లకు చేర్చగలమని పేర్కొన్నారు. ఆఫ్‌లైన్ రిటైల్ విభాగంలో ప్రస్తుతం టాప్‌లో ఉన్న డీమార్ట్‌ను తాము 18-24 నెలల్లో అధిగమించగలమని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో JIIF ఫౌండేషన్ డే ప్రొగ్రామ్‌లో ఆయన మాట్లాడారు.
Similar News
News December 9, 2025
మా కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్: గల్లా జయదేవ్

TG: పెట్టుబడులకు హైదరాబాద్ బెస్ట్ డెస్టినేషన్ అని మాజీ ఎంపీ, అమర్‌రాజా గ్రూప్ ఛైర్మన్ గల్లా జయదేవ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కంపెనీలకు మంచి సహకారం అందిస్తున్నారని గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన తెలిపారు. ఫ్యూచర్ సిటీలో రూ.9వేల కోట్లతో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని, తమ కంపెనీ చరిత్రలోనే ఇదే అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్ అని పేర్కొన్నారు. మరోవైపు అవసరమైతే మళ్లీ రాజకీయాల్లోకి వస్తాయని ఆయన ప్రకటించారు.
News December 9, 2025
చైనాకు వెళ్తుంటే జాగ్రత్త!

భారతీయులు చైనాకు వెళ్తున్నా, ఆ దేశం మీదుగా ప్రయాణిస్తున్నా జాగ్రత్తలు తీసుకోవాలని విదేశాంగశాఖ సూచించింది. ఇటీవల షాంఘై ఎయిర్‌పోర్టులో AR.P మహిళను <<18509379>>నిర్బంధించిన<<>> నేపథ్యంలో హెచ్చరించింది. భారతీయులను లక్ష్యంగా చేసుకోబోమని చైనా హామీ ఇస్తుందని ఆశిస్తున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ తెలిపారు. నిర్బంధించడం మానుకొని విమాన ప్రయాణ నిబంధనలు గౌరవిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.
News December 9, 2025
షాంఘైలో మహిళ నిర్బంధం.. ఏం జరిగింది?

పెమా వాంగ్ అనే మహిళ గత నెల లండన్ నుంచి జపాన్ వెళ్తుండగా తన ఫ్లైట్ ట్రాన్సిట్ హాల్ట్ కోసం షాంఘైలో ఆగింది. అయితే ఎయిర్‌పోర్ట్ అధికారులు తన పాస్‌పోర్టులో అరుణాచల్ ప్రదేశ్ అని ఉండటంతో అది చెల్లదని 18గంటలు నిర్బంధించారని ఆమె ఆరోపించారు. ఆపై IND ఎంబసీని సంప్రదిస్తే సాయం అందినట్లు చెప్పారు. దీనిపై భారత్ స్పందిస్తూ.. AR.P ఎప్పటికీ INDలో భాగమే అని, అక్కడి ప్రజలు భారత్ పాస్‌పోర్ట్ కలిగి ఉంటారని చెప్పింది.


