News November 29, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్య అంశాలు

image

∆} ఖమ్మం:రైతుకు ఏది మేలు అయితే అదే అమలు చేస్తాం: తుమ్మల∆} ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను కలిసిన సత్తుపల్లి ఎమ్మెల్యే∆}కొత్తగూడెం: కోచింగ్ లేకుండానే మూడు ఉద్యోగాలు∆} వైరా:భర్తపై భార్య కత్తితో దాడి∆} మధిర: షిఫ్ట్ కారులో వచ్చి పలు ఇండ్లలో దొంగతనాలు∆} మణుగూరు: జర్నలిస్టులపై కేసు కొట్టివేత∆}వెంకటాపురం:ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి

Similar News

News November 30, 2024

సీనియర్ సిటిజన్స్‌కు వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

image

సీనియర్ సిటిజన్స్ కు జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక ప్రాధాన్యతతో ఒకేచోట వివిధ వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో సీనియర్ సిటిజన్‌ల కొరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య సేవల విభాగాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఆసుపత్రికి వచ్చే వయో వృద్ధులకు సీనియర్ సిటిజన్ వైద్య సేవల విభాగం ద్వారా సంపూర్ణ సేవలు అందించాలని వైద్యాధికారులకు సూచించారు.

News November 30, 2024

ప్రభుత్వ విద్యా సంస్థల బంద్‌కు పిలుపు

image

ప్రభుత్వ విద్యా సంస్థల్లో వరసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలను నిరసిస్తూ రేపు ఖమ్మం జిల్లాలో విద్యా సంస్థల బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు అనేక మరణాలు జరిగాయని వారు ఆరోపించారు. చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు ఎగ్స్ గ్రేషియా చెల్లించి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. SFI,PDSU,AISF సంఘాలు బంద్ కు మద్దతు ఇస్తున్నట్లు ఆసంఘాల ప్రతినిధులు తెలిపారు.

News November 29, 2024

మంత్రి తుమ్మల వ్యాఖ్యలపై మీ కామెంట్..?

image

రైతు బంధుపై మంత్రి తుమ్మల ‘మహబూబ్ నగర్‌ రైతు పండుగ’ సభలో ఈరోజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘రైతుబంధు కంటే సన్నవడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ బాగుందని రైతులు అంటున్నారు’ అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు. తాము రైతులకు కల్లబొల్లి కబుర్లు చెబుతూ పల్లకీలో ఊరేగించబోమని, ప్రభుత్వం తరఫున చేయాల్సినంత చేస్తామన్నారు. మంత్రి వ్యాఖ్యలపై మీ కామెంట్ తెలపండి.