News February 27, 2025
కడెంలో అక్రమంగా తరలిస్తున్న టేకు ఫర్నీచర్ పట్టివేత!

అక్రమంగా తరలిస్తున్న ఫర్నీచర్ వాహనాన్ని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. కడెం మండలంలోని గంగాపూర్ నుంచి ట్రాక్టర్ వాహనంలో వడ్ల సంచులు నింపుకొని లోపలి భాగంలో టేకు ఫర్నీచర్ సోఫాసెట్, బెడ్స్, డ్రెస్సింగ్ టేబుల్, డైనింగ్ టేబుల్ను ఉంచి తరలిస్తున్నారన్న పక్క సమాచారం మేరకు సెక్షన్ అధికారి కింగ్ ఫిషర్ పట్టుకొని రేంజ్ కార్యాలయానికి తరలించారు. అక్రమంగా కలప తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News February 27, 2025
సిరిసిల్లలో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఓటింగ్

సిరిసిల్ల జిల్లాలో ఎమ్మెల్సీ ఓటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఈరోజు ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. మొత్తం జిల్లాలో ఇప్పటికే అధికారులు 41 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 23,347 పట్టభద్రులు ఉన్నారు.
News February 27, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పోలింగ్ ప్రారంభం

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గీతా నగర్‌లో ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా ఉన్నతాధికారులు ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరిగేందుకు పటిష్ఠ బందోబస్తు భద్రతను ఏర్పాటుచేశారు. ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లు తమ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.
News February 27, 2025
వెబ్ ల్యాండ్ నుంచి ఎమ్మెల్యే ఆస్తుల తొలగింపు

రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి భార్య జ్యోతమ్మ, తమ్ముడు అనిల్ కుమార్ రెడ్డి, మరదలు సృజన పేరుతో ఉన్న భూములను మంగళవారం వెబ్ ల్యాండ్ నుంచి తొలగించినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. రాజంపేట మండలంలో ఉన్న 30.13 ఎకరాల ప్రభుత్వ భూమిగా నమోదు చేశారు. మందపల్లి సర్వేనంబర్ 814-3లో 4 ఎకరాలు, 814-4లో 5 ఎకరాలు, 815-1,2 లో 8.79 ఎకరాలు, 816-2 లో 4.31 ఎకరాలు, ఆకేపాడు 56/8,9లో 8.03 ఎకరాలు.