News May 24, 2024
గంట ముందే పరీక్షా కేంద్రానికి రావాలి: ఏలూరు డీఈవో
ఏలూరు జిల్లాలో ఏర్పాటు చేసిన 50 పరీక్ష కేంద్రాలలో టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని డీఈవో అబ్రహం తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం 11,500 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. ఈ నేపథ్యంలోనే ఏలూరులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఫిర్యాదులు ఉంటే నెం.8121840400కు ఫోన్ చేయాలన్నారు. గంట ముందు పరీక్షా కేంద్రానికి హాజరుకావాలని విద్యార్థులకు సూచించారు.
Similar News
News November 29, 2024
ద్వారకాతిరుమల: డిగ్రీ చదువుతూ.. శ్రీవారి ఆలయంలో బైక్ దొంగతనాలు
ఏలూరులో డిగ్రీ చదువుతూ.. ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని గురువారం అరెస్టు చేశామని CI విల్సన్, SI సుధీర్ బాబు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. సింగరాయకొండ మండలం మూలగుంటపాడు గ్రామానికి చెందిన గణేశ్ ఏలూరు హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. వ్యసనాలకు బానిసైన అతడు డబ్బులు అవసరమై బైక్ దొంగతనాలు చేస్తున్నాడని, 3 బైకులు రికవరీ చేశామని పోలీసులు స్పష్టం చేశారు.
News November 29, 2024
ఏలూరు: నవంబర్ 30న రూ.112.68 కోట్ల పంపిణీ
NTR భరోసా పెన్షన్ పంపిణీలను నవంబర్ 30న లబ్దిదారులకు 100 శాతం అందజేయాలని కలెక్టర్ వెట్రి సెల్వి టెలి కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులకు గురువారం ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 2,62,836 మంది పెన్షన్ లబ్ధిదారులకు రూ.112.68 కోట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. డిసెంబర్ నెల పింఛన్లను ఒకరోజు ముందుగా అందిస్తున్నామన్నారు. పెన్షన్ పంపిణీలో పొరపాట్లు ఉండకూడదని హెచ్చరించారు.
News November 28, 2024