News October 16, 2024

నిజాంపట్నం: ‘18 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదు’

image

భారీ వర్షాల నేపథ్యంలో బాపట్ల జిల్లాలో మత్స్యకారులు ఈ నెల 18 వరకు వేటకు వెళ్లరాదని నిజాంపట్నం మత్స్య శాఖ సహాయ డైరెక్టర్ సైదా నాయక్ తెలిపారు. తీరంలో అలలు, గాలుల ఉద్ధృతి అధికంగా ఉన్న నేపథ్యంలో వేట చేయటం నిషేధించినట్లు చెప్పారు. కావున మత్స్యకారులు మత్స్య శాఖ ఆదేశాలను పాటించి బోటులను, సురక్షిత ప్రాంతాలలో భద్రపరుచుకోవాలని సూచించారు.

Similar News

News November 23, 2024

గుంటూరు: చిన్నారిపై బీటెక్ విద్యార్థి అఘాయిత్యం

image

గుంటూరులో శుక్రవారం రాత్రి దారుణ ఘటన వెలుగుచూసింది. ఏడేళ్ల చిన్నారిపై బీటెక్ విద్యార్థి హత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల తెలిపిన వివరాలు.. గుంటూరులో దంపతులు ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. పక్కింటికి చెందిన నవీన్(20) బాలికను ఎవరూలేని ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యం చేశాడు. బాలిక కేకలు వేయడంతో తల్లిదండ్రులు రాగా విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

News November 23, 2024

ఉండవల్లిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎంపీల సమావేశం 

image

ఉండవల్లి నివాసంలో శుక్రవారం సాయంత్రం సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంట్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ ఎంపీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబు ఎంపీలతో చర్చించారు. అలాగే పార్టీ పాలనాపరమైన అంశాలు, కేంద్రంపై వ్యూహాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

News November 23, 2024

గుంటూరు జిల్లా TODAY TOP NEWS

image

★ గుంటూరు: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
★ మంగళగిరి: మంత్రి లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. కేసు నమోదు
★ గుంటూరు: కారంచేడు రైల్వే గేటును ఢీ కొన్న కారు
★ గుంటూరు: తుపాకీ మిస్ ఫైర్.. కానిస్టేబుల్ శ్రీనివాస్ మృతి
★ వినుకొండ: స్నానానికి వెళ్లిన స్వాములు.. ఇద్దరు మృతి
★ దాచేపల్లిలో డివైడర్‌ను ఢీకొని యువకుడు మృతి