News May 12, 2024
ప్రకాశం: నేర చరితులకూ పోలింగ్ ఏజెంట్లుగా అవకాశం
జిల్లాలో సోమవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులకు పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరించేందుకు నేరచరితులకు కూడా అవకాశం కల్పిస్తూ ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కమిషన్ తాజా ఉత్తర్వులతో నేరచరితులు, రౌడీషీటర్లు కూడా పోలింగ్ ఏజెంట్లుగా పని చేయవచ్చని తెలిపింది. అది కూడా గత సార్వత్రిక ఎన్నికల వరకు సత్ప్రవర్తన కలిగిన వ్యక్తులకు అవకాశం కల్పించినట్లు తెలిపారు.
Similar News
News November 30, 2024
మద్దిపాడులో చిన్నారి మృతి
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ వద్ద శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలుడు సూర్య ఓ ఫ్యాక్టరీ గేట్ దగ్గర ఆడుకుంటుండగా.. ఒక్కసారిగా గేటు ఊడి బాలుడిపై పడింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతి చెందిన బాలుడు అక్కడే పనిచేస్తున్న వాచ్‌మెన్ మనవడు అని సమాచారం.
News November 30, 2024
బాలినేని తనయుడిపై సంచలన ఆరోపణలు
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ తనయుడు ప్రణీత్ రెడ్డిపై డాక్టర్ యాదాల అశోక్ సంచలన ఆరోపణలు చేశారు. ‘గత ఎన్నికల ముందు చినగంజాం MPP అంకమరెడ్డి నన్ను ప్రణీత్ రెడ్డి దగ్గరకు తీసుకెళ్లారు. సంతనూతలపాడు టికెట్ కోసం ఫోన్‌పేలో రూ.10 లక్షలు, క్యాష్‌గా మరో 15 లక్షలు ఇచ్చా. టికెట్ రాకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరా. కులం పేరుతో నన్ను తిట్టారు’ అని అశోక్ ఒంగోలు తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News November 30, 2024
చీమకుర్తిలో కిడ్నాప్
ప్రకాశం జిల్లాలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు మండలం మడగడ గ్రామానికి చెందిన దినేశ్(16)ని కిడ్నాప్ చేశారు. ఈక్రమంలో అతడిని చీమకుర్తి గాంధీనగర్‌లో ఉంటున్న అరవింద్ అనే వ్యక్తి ఇంటికి కిడ్నాపర్లు తీసుకు వచ్చారు. దినేశ్ వారి నుంచి తప్పించుకుని చీమకుర్తి పోలీసులను ఆశ్రయించాడు. CI సుబ్బారావు కిడ్నాపర్లను వెంబడించి ఒకరిని పట్టుకోగా మరో ఇద్దరు పరారయ్యారు.