News November 21, 2024

బనవాసిలో 77 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్కు: మంత్రి సవిత

image

ఎమ్మిగనూరు (మం) బనవాసిలో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకు చేనేత, జౌళి శాఖ 91 ఎకరాల ప్రభుత్వ భూమిని 2016లో TDP ప్రభుత్వం కేటాయించిందని మంత్రి సవిత తెలిపారు. నిబంధనల మేరకు మూడేళ్లలో ఈ భూమిని వినియోగించకపోవడంతో 2020లో కర్నూలు కలెక్టర్‌ ఈ కేటాయింపులు రద్దు చేసి, పేదల ఇళ్ల స్థలాలకు 13.96 ఎకరాలను కేటాయించారన్నారు. మిగతా 77 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో మంత్రి పేర్కొన్నారు.

Similar News

News November 23, 2024

నంద్యాల జిల్లా యువకుడికి 18వ ర్యాంక్

image

నంద్యాల జిల్లా యువకుడు ఆల్ ఇండియా ర్యాంక్‌తో సత్తా చాటాడు. దొర్నిపాడు మండలం రామచంద్రపురం గ్రామనికి చెందిన గడ్డిపాటి నాగరాజు కుమారుడు యశ్వంత్ కుమార్ చెన్నైలోని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నారు. ఈక్రమంలో ఆయన ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్‌(IES) పరీక్ష రాశారు. ఇండియాలోనే 18వ ర్యాంక్ సాధించారు. ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.

News November 23, 2024

డ్రోన్ సిటీతో వేల మందికి ఉద్యోగ అవకాశాలు: మంత్రి బీసీ

image

ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటుతో వేల మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అసెంబ్లీలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన డ్రోన్ పాలసీపై అసెంబ్లీలో ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో సుమారుగా 100 డ్రోన్ కంపెనీలు ప్రారంభించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. తద్వార అనేక మందికి ఉపాధి కల్పించవచ్చని మంత్రి తెలిపారు.

News November 23, 2024

నేటి నుంచి శ్రీశైలంలో స్పర్శ దర్శనం నిలిపివేత

image

శ్రీశైల క్షేత్రంలో మళ్లికార్జున స్వామి స్పర్శదర్శనం శని, ఆది, సోమవారాల్లో నిలిపివేసినట్లు దేవస్థానం ఈవో చంద్రశేఖర్ ఆజాద్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. శని, ఆది, సోమవారాల్లో క్షేత్రానికి భక్తుల తాకిడి అధికంగా ఉండడంతో ఈ మూడు రోజుల్లో ఉచిత స్పర్శదర్శన సేవలు నిలిపివేసినట్లు చెప్పారు. తిరిగి మంగళవారం నుంచి శుక్రవారం వరకు యథావిధిగా స్పర్శ దర్శనం సేవలు కొనసాగుతాయని వెల్లడించారు.