News February 27, 2025

భువనగిరి: ఒకే కాన్పులో రెండు లేగదూడలు

image

ఆవు ఒకే కాన్పులో రెండు లేగ దూడలకు జన్మనిచ్చిన అరుదైన ఘటన భువనగిరి మున్సిపాలిటి రాయగిరిలో తెల్లవారుజామున జరిగింది. గ్రామానికి చెందిన కొత్త కృష్ణ అనే రైతుకు చెందిన పాడి రైతు ఆవు ఉదయం రెండు లేగ దూడలను జన్మనిచ్చింది. లేగ దూడలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయని ఇలాంటి అరుదైన ఘటన జరగడం విశేషమని రైతు తెలిపారు. ప్రసవించిన లేగ దూడలను చూడడానికి స్థానికులు రైతు ఇంటికి తరలివెళ్లారు. 

Similar News

News February 27, 2025

సీఎం చంద్రబాబును కలిసిన పీటీ ఉష

image

AP: సీఎం చంద్రబాబును భారత ఒలింపిక్‌ సంఘం (ఐవోఏ) అధ్యక్షురాలు, ఎంపీ పీటీ ఉష కలిశారు. వెలగపూడిలోని సచివాలయంలో వీరిద్దరూ భేటీ అయ్యారు. నూతన క్రీడా విధానం, అథ్లెట్లకు శిక్షణకు సంబంధించి వీరు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. అమరావతిలో స్పోర్ట్స్ సిటీ అభివృద్ధి, నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుపై చర్చించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలను సీఎం తన ఎక్స్‌ ఖాతాలో షేర్ చేశారు.

News February 27, 2025

US: ప్రాణాపాయ స్థితిలో కూతురు.. తండ్రికి వీసా తిరస్కరణ

image

మహారాష్ట్రకు చెందిన నీలమ్ షిండే అనే యువతి USలో హిట్ అండ్ రన్‌లో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉంది. కూతురి కోసం అక్కడికెళ్లడానికి తండ్రి ప్రయత్నించగా ముంబై వీసా అధికారులు పట్టించుకోలేదు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. తాము వీసా ఆఫీస్‌కు వెళితే సమస్య వినడానికి కూడా సిబ్బంది ఆసక్తి చూపలేదని వాపోయారు. మహారాష్ట్ర ప్రభుత్వం, విదేశాంగ మంత్రి జైశంకర్ చొరవచూపాలని కోరుతున్నారు.

News February 27, 2025

గుడ్లు తినేవారు ఈ తప్పులు చేస్తున్నారా?

image

గుడ్లు అంటే చాలామందికి ఇష్టం. వాటిని వండేటప్పుడు, తినేటప్పుడు కొన్ని తప్పులు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. గుడ్లను అతిగా ఉడికిస్తే పోషకాలు తగ్గిపోతాయి. 20 నిమిషాలపాటు ఉడికించాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉన్న గుడ్లు తినకూడదు. దానిలో ఉండే రుచి తగ్గిపోతుంది. గుడ్లను నేరుగా పాన్ లేదా వంటపాత్రలో పగలగొట్టకూడదు. గుడ్డు పెంకుపై ఉండే బ్యాక్టీరియా వీటిలోకి చేరుతుంది. వేరే పాత్రలో ఫిల్టర్ చేశాకే ఉపయోగించాలి.

error: Content is protected !!