News February 27, 2025
మహా నగరంలో.. మహా శివరాత్రి ఎఫెక్ట్

ట్రాఫిక్ జామ్‌లతో నిండిపోయే మహానగరపు రోడ్లు ఇవాళ కాస్త ఖాళీగా కనిపించాయి. మహా శివరాత్రిని పురస్కరించుకుని భక్తిశ్రద్ధలతో జాగరణలో గడిపారు. ఈ ఎఫెక్ట్‌తో ఉదయం లేట్‌గా రోడ్లపైకి వస్తుండటంతో 11 తర్వాత వాహనాలు పెరిగాయి. JNTU, మియాపూర్, బాచుపల్లి, మాదాపూర్, సికింద్రాబాద్, అమీర్‌పేట్, ఖైరతాబాద్, ABIDS, DSNR వంటి బిజీరోడ్లపై ఇప్పుడిప్పుడే హారన్‌మోతలు పెరిగాయి. మీప్రాంతంలో రద్దీగా ఉందా? కామెంట్ చేయండి.
Similar News
News February 27, 2025
వరంగల్: ముగిసిన పోలింగ్.. 94 శాతం పోలింగ్

ఉమ్మడి వరంగల్-నల్గొండ-ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక వరంగల్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. వరంగల్ జిల్లాలో మొత్తం 2352 ఓట్లకు 2214మంది ఉపాధ్యాయులు ఓటేశారు. మొత్తంగా 94.13 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
News February 27, 2025
నీటిని జాగ్రత్తగా వాడుకోండి.. AP, TGలకు KRMB సూచన

తెలుగు రాష్ట్రాల ఈఎన్‌సీలతో కేఆర్ఎంబీ సమావేశం ముగిసింది. శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో తక్కువ నీరు ఉన్నందున వృథా కాకుండా జాగ్రత్తగా వాడుకోవాలని సూచించింది. తాగు, సాగు నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలంది. 15 రోజులకోసారి ఇరు రాష్ట్రాల అధికారులు పరిస్థితులను సమీక్షించుకోవాలని ఆదేశించింది. రెండు ప్రాజెక్టుల నుంచి తమకు 55TMCలు కావాలని ఏపీ, 63TMCలు ఇవ్వాలని తెలంగాణ కోరిన విషయం తెలిసిందే.
News February 27, 2025
బాపట్ల జిల్లాలో 70.78% పోలింగ్ నమోదు

బాపట్ల జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం 4 గంటలకు వరకు 70.78శాతం పోలింగ్ నమోదైనట్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి గంగాధర్ తెలిపారు. చుండూరు మండలంలో 66.46, అమృతలూరు 74.40, వేమూరు 72, కొల్లూరు 63.33, భట్టిప్రోలు 66.43, చెరుకుపల్లి 72.88, నగరం 63.51, రేపల్లె 67.76, నిజాంపట్నం 68.89, పిట్టలవానిపాలెం 68.88, కర్లపాలెం 71.70, బాపట్ల మండలంలో 71.70శాతం ఓటింగ్ జరిగింది.