News February 27, 2025
మారుమూల గ్రామాల్లో అల్లూరి ఎస్పీ పర్యటన

పెదబయలు మండలం మారుమూల జామిగూడా పంచాయతీ గుంజివాడ, చింతల వీధి గ్రామాలలో బుధవారం అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్, ఏఎస్పీ ధీరాజ్ పర్యటించారు. గుంజివాడ గ్రామంలో శివరాత్రి సందర్భంగా జరుగుతున్న బాపనమ్మ బాలలింగేశ్వర దేవత జాతర సందర్భంగా దైవ దర్శనం చేసుకున్నారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమీపంలో గల తారాబు జలపాతాన్ని సందర్శించి సందడి చేశారు.
Similar News
News February 27, 2025
కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా

కరీంనగర్ జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. గడచిన 24 గంటల్లో అత్యధికంగా బురుగుపల్లి 38.0°C నమోదు కాగా, ఈదులగట్టేపల్లి 37.4, నుస్తులాపూర్ 37.1, తాంగుల, పోచంపల్లి 36.3, గంగిపల్లి, గట్టుదుద్దెనపల్లె 35.9, జమ్మికుంట 35.7, అర్నకొండ 35.6, కరీంనగర్ 35.5, తాడికల్, దుర్శేడ్, కొత్తపల్లి-ధర్మారం 35.4, కొత్తగట్టు 35.1, గంగాధర 34.9, గుండి 34.8, వీణవంక 34.6, ఇందుర్తి 34.5, వెదురుగట్టు 34.2°Cగా నమోదైంది.
News February 27, 2025
BNGR: టైర్ పగిలి ఇంట్లో ఉన్న వృద్ధురాలికి గాయం..

రోడ్డుపై వెళ్తున్న వాటర్ ట్యాంకర్ టైరు పగిలి దాని నుంచి వేరుపడిన ఇనుప వస్తువు ఇంట్లో కూర్చొని ఉన్న వృద్ధురాలి కాలికి తాకడంతో ఆమెకు తీవ్ర గాయాలైన ఘటన భువనగిరిలో జరిగింది. బాధితురాలి కుటుంబీకుల వివరాలిలా.. ములుగు జిల్లా జగన్నాథపురానికి చెందిన రామలక్ష్మి బంధువుల ఇంటికి వచ్చారు. ఇంట్లో కూర్చొని ఉండగా ఈ ఘటన జరిగింది. ఘటనపై కేసు నమోదైంది.
News February 27, 2025
#WeStandWithPosani అంటున్న వైసీపీ శ్రేణులు

AP: కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. పోసాని కృష్ణమురళి అరెస్టును ఖండిస్తూ #WeStandWithPosani అని కార్యకర్తలు ట్వీట్లు చేస్తున్నారు. గతంలో సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వారిని అరెస్టు చేశారని, ఇప్పుడు నాయకులను టార్గెట్ చేశారని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం వైసీపీ నేతలపై కాకుండా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.