News February 27, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పోలింగ్ ప్రారంభం

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గీతా నగర్‌లో ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా ఉన్నతాధికారులు ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరిగేందుకు పటిష్ఠ బందోబస్తు భద్రతను ఏర్పాటుచేశారు. ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లు తమ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.
Similar News
News February 27, 2025
ముగిసిన వంశీ కస్టడీ

AP: వైసీసీ నేత వల్లభనేని వంశీ మూడోరోజు పోలీస్ కస్టడీ ముగిసింది. సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపు కేసులో వంశీని పోలీసులు 3 రోజుల పాటు ప్రశ్నించారు. వంశీతో పాటు లక్ష్మీపతి, శివరామకృష్ణను విచారించారు. వంశీని మరోసారి కస్టడీకి తీసుకోవాలనే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. దీనిపై త్వరలోనే కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.
News February 27, 2025
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్

ఏపీ, తెలంగాణలో MLC ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇరు రాష్ట్రాల్లో 3 చొప్పున స్థానాలకు ఉ.8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. TGలో ఉమ్మడి MDK-NZB-ADB-KNR గ్రాడ్యుయేట్, టీచర్, ఉమ్మడి WGL-KMM-NLGలో టీచర్ MLC స్థానానికి, APలో ఉమ్మడి గుంటూరు-కృష్ణా, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల్లో గ్రాడ్యుయేట్, ఉత్తరాంధ్రలో టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరిగింది. మార్చి 3న కౌంటింగ్ జరగనుంది.
News February 27, 2025
పార్వతీపురం జిల్లాలో 85.60% పోలింగ్

పార్వతీపురం మన్యం జిల్లాలో 15 పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల వరకు 85.60 శాతం పోలింగ్ నమోదైంది. ఈ మేరకు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. 2,333 మంది టీచర్లకు గాను 1,997 మంది ఓటేశారు. జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.