News November 29, 2024

రుణ రేపు.. మాపు అంటూ కాలక్షేపం చేశారు: మంత్రి ఉత్తమ్

image

పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రుణమాఫీ విషయంలో రైతులను చాలా మోసం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రుణ మాఫీ విషయంలో రేపు.. మాపు అంటూ కాలక్షేపం చేశారని మండిపడ్డారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన రైతు అవగాహన సదస్సు లో పాల్గొని మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేశామని తెలిపారు. ఇంకా కొందరికి రుణమాఫీ కావాల్సి ఉందని అన్నారు.

Similar News

News November 30, 2024

MBNR: సమీక్ష సమావేశం.. హాజరైన మంత్రులు, MLAలు

image

మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్‌లో ఇరిగేషన్ అండ్ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధ్యక్షతన సాగునీటి, పౌరసరఫరాల, వ్యవసాయసాయ రంగాలపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు , ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

News November 29, 2024

షాద్‌నగర్: రైతు పండగలో పాల్గొన్న ఎమ్మెల్యే

image

ప్రజా పరిపాలన విజయోత్సవ వేడుకల్లో భాగంగా 2వ రోజు రైతు పండుగలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆధునిక వ్యవసాయ పద్ధతులు,లాభాదాయకమైన వ్యవసాయ పద్ధతులు, వివిధ పంట ఉత్పత్తుల గురించి రైతులకు అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు.

News November 29, 2024

MBNR: రోడ్ల నిర్మాణానికై కేంద్ర మంత్రికి ఎంపీ అరుణ వినతి

image

మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ శుక్రవారం ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరిని కలిశారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని పలు జాతీయ రహదారుల అనుసంధానం, సింగిల్ నుంచి డబుల్, డబుల్ నుంచి 4 లేన్స్, 6లేన్స్ రోడ్ల నిర్మాణానికి ప్రతి పాదనలతో ఉన్న వినతులను కేంద్రమంత్రికి అందించారు. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపింది.