News November 7, 2024
వరంగల్: తరలి వచ్చిన పసుపు.. తగ్గిన ధర
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు నేడు పసుపు తరలివచ్చింది. ధర మాత్రం నిన్నటితో పోలిస్తే నేడు తగ్గింది. నిన్న పసుపు క్వింటాకి రూ.11,111 ధర రాగా నేడు రూ.10,069 ధర వచ్చింది. 5531 రకం మిర్చి నిన్నటిలాగే నేడు రూ.13వేలు పలికింది. మరోవైపు మక్కలు బిల్టి క్వింటాకి మంగళవారం రూ.2,460 ధర రాగా, బుధవారం రూ.2445 ధర వచ్చింది. అయితే గత రెండు రోజులతో పోలిస్తే ఈరోజు ధర పెరిగి రూ.2470 అయిందని అధికారులు తెలిపారు.
Similar News
News November 24, 2024
విజయోత్సవాల్లో పాల్గొనాలని ఎమ్మెల్యేలకు మంత్రి సీతక్క లేఖలు
ఈనెల 26న గ్రామ పంచాయతీలో జరిగే ప్రజా పాలన విజయోత్సవాల్లో పార్టీలకతీతంగా రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు పాల్గొనాలని పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క లేఖలు రాశారు. నవంబర్ 26న రాష్ట్రవ్యాప్తంగా 95 గ్రామీణ నియోజకవర్గాల్లో రూ.2750 కోట్ల నిధులతో గ్రామ పంచాయతీల్లో ఇందిరా శక్తి మహిళా ఉపాధి భరోసాతో వివిధ అభివృద్ధి పనులు చేయాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు.
News November 24, 2024
ములుగు: త్వరలో మరో రెండు పథకాలు అమలు చేస్తాం: మంత్రి సీతక్క
ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీలలో రైతు రుణమాఫీ, ఉచిత కరెంటు, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, రూ.500 గ్యాస్ సిలిండర్ అందజేస్తునట్లు తెలిపారు. రూ.10లక్షల లోపు ఆరోగ్యశ్రీ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2500, పింఛన్ల పెంపు కార్యక్రమాన్ని త్వరలోనే అమలు చేస్తామన్నారు.
News November 24, 2024
ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైం న్యూస్..
> MHBD: ఉరి వేసుకుని మహిళా ఆత్మహత్య..
> JN: సైబర్ నేరాల పట్ల విద్యార్థులకు అవగాహన సదస్సు..
> NSPT: రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు..
> MHBD: విషపు నీటితో వానరం మృత్యువాత?
> HNK: కల్వర్టు కిందికి దూసుకెళ్లిన టిప్పర్..
> MHBD: రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన..
> NSPT: చిత్తుబొత్తు ఆడుతున్న వ్యక్తుల అరెస్ట్