News February 27, 2025
సత్యసాయి: రోడ్డు ప్రమాదంలో ఒకరి స్పాట్ డెడ్

శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు మండల పరిధిలోని పెద్దనపల్లి క్రాస్‌లో రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో చాకలి ఆంజనేయులు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో అతడి తమ్ముడికి గాయాలు అయ్యాయి. విషయం తెలిసిన వెంటనే పెద్దనపల్లి గ్రామంలోని అతని తండ్రి నాగరాజుతో పాటు పలువురు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ వ్యక్తిని బెంగళూరు ఆసుపత్రికి తరలించారు.
Similar News
News February 27, 2025
పెద్దపల్లి జిల్లాలోని పోలింగ్ అప్డేట్

పెద్దపల్లి జిల్లాలోని ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్నది. మధ్యాహ్నం 12 గంటల వరకు పట్టభద్రుల పోలింగ్ 20.88% నమోదయింది. మహిళలు 2501, పురుషులు 3982, మొత్తం 6483 మంది ఓటు వేశారు. టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్ 47.25% నమోదైంది. మహిళలు 212, పురుషులు313, మొత్తం 525 మంది ఓటు వేశారు.
News February 27, 2025
ప్రపంచంలోనే అతి చిన్న పార్క్ ఇదే!

పార్క్ అనగానే పచ్చని చెట్లు, సేదతీరేందుకు కుర్చీలు, వాకింగ్ ట్రాక్‌లు గుర్తొస్తాయి. అయితే, కేవలం 50CMS మాత్రమే ఉన్న అతిచిన్న పార్కు గురించి మీరెప్పుడైనా విన్నారా? జపాన్ షిజుయోకాలోని నాగిజుమి టౌన్‌లో 0.24 చదరపు మీటర్లలో A3 పేపర్ షీట్‌లా ఈ ఉద్యానవనం ఉంటుంది. దీనిని 1988లో నిర్మించగా 2024లో సిటీ పార్కుగా మారింది. ఇది ప్రపంచంలోనే అతిచిన్న పార్క్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.
News February 27, 2025
జగిత్యాల: 12 pm వరకు పోలింగ్ శాతం నమోదు వివరాలు

జగిత్యాల జిల్లాలో పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ శాతం గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు నమోదైన వివరాలు ఇలా ఉన్నాయి. టీచర్ ఎమ్మెల్సీకి 39.12 శాతం ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోగా.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు 20.10శాతం వినియోగించుకున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మొత్తంగా రెండు కలిపి 21 శాతం పోలింగ్ నమోదు అయినట్లు పేర్కొన్నారు.