News February 27, 2025
స్టేషన్ ఘనపూర్: నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి

జనగామ జిల్లాలో విషాదం నెలకొంది. చిల్పూర్ మండలం నష్కల్ గ్రామానికి చెందిన రాజు-అపర్ణలు తమ తకూరు తపస్వి(4)తో కలిసి అపర్ణ తల్లిగారి ఊరైన స్టే.ఘ.లో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో చిన్నారి ఆడుకుంటూ వెళ్లి నీటితొట్టిలో పడింది. గమనించిన అపర్ణ వెంటనే తన కూతురిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Similar News
News February 27, 2025
ఎచ్చెర్ల : ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య

విజయనగరంలో ఎచ్చెర్లకు చెందిన విద్యార్థి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న లోకేశ్ స్థానిక బొడ్డువారి జంక్షన్‌లో ఫ్రెండ్స్‌తో ఉంటున్నాడు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అన్నయ్య గణేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు.
News February 27, 2025
HYD: ఆ రోజులూ మళ్లీరావు..!

శివరాత్రికి శివుడిని ఎంత ఇష్టంగా కొలుస్తారో.. అంతే ఇష్టంగా జాగరణలో చేస్తారు. HYDలో అనేక చోట్ల యువత కోసం రాత్రంతా క్రికెట్, వాలీబాల్ టోర్నమెంట్లు ఏర్పాట్లు చేశారు. పెద్దలు స్వామి వారిని.. సంకీర్తనలు, భజనతో స్మరించుకుంటూ జాగరణ పూర్తి చేశారు. కానీ గతంలో మన ఊళ్లల్లో వేసే పద్య, పౌరాణిక, జానపద నాటకాలకు పెద్ద ఫ్యాన్ బేస్ ఉండేది. చిన్నతనంలో పదాలు అర్థం కాకపోయినా చూస్తూ కూర్చునేవాళ్లం. మీరెలా జాగరణ చేశారు.
News February 27, 2025
హనుమకొండ జిల్లాలో మహాశివరాత్రి అప్‌డేట్స్

✓ వేయి స్తంభాల ఆలయానికి పోటెత్తిన భక్తులు
✓ మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు.. Way2Newsతో ఛైర్మన్, అర్చకులు
✓ ఐనవోలు ఆలయంలో భక్తుల సందడి
✓ వంగర: శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్
✓ HNK: హయగ్రీవ చారి మైదానంలో మహాశివరాత్రి సందర్భంగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు
✓ HNK: పెళ్లికొడుకు రూపంలో దర్శనమిస్తున్న రుద్రేశ్వర స్వామి