UAE గోల్డెన్ వీసా.. వలసలు పెరుగుతాయా?

UAE గోల్డెన్ వీసాతో భారతీయులు ఆ దేశంలో స్థిరపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో రూ.4.66 కోట్ల పెట్టుబడి పెడితేనే ఈ వీసా వచ్చేది. ఇప్పుడు రూ.23 లక్షలు చెల్లిస్తే చాలు జీవితకాలం చెల్లుబాటయ్యే వీసా వస్తుంది. గోల్డెన్ వీసా పొందిన వ్యక్తులు తమ కుటుంబసభ్యులను అక్కడికి తీసుకెళ్లొచ్చు. వ్యాపారం, ఉద్యోగం చేసుకోవచ్చు. ఆ దేశంలో తక్కువ పన్నులు, మెరుగైన మౌలిక వసతులు భారతీయులను ఆకర్షించొచ్చు.