India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP అసెంబ్లీలో PAC ఛైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రతిపక్షానికి ఈ పదవిని ఇవ్వడం ఆనవాయితీగా వస్తుండగా, సభ్యుడి ఎన్నికకు 18 ఓట్లు అవసరం. వైసీపీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండటంతో ఇవాళ నామినేషన్ వేస్తారా? లేదా? అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే జగన్‌కు ప్రతిపక్ష హోదా దక్కలేదని అసంతృప్తిగా ఉన్న వైసీపీ నేతలు PAC ఛైర్మన్ పదవి అంశంలో ఎలా ముందుకెళ్తారో చూడాలి.
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను పొందిన మిచెల్ యోహ్ ఎన్నో విజయాలను చూశారు. ఆస్కార్ అవార్డు సైతం ఆమెను వరించింది. కానీ, తాను తల్లి కావడంలో ఫెయిల్ అయ్యానంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తల్లిగా అనుభూతి చెందలేకపోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పిల్లలు కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సంతానోత్పత్తికి చికిత్స కూడా తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.
AP: SCT పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు స్టేజ్-2 దరఖాస్తు గడువును మరో వారం రోజులు పొడిగించినట్లు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. ఈనెల 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. మరిన్ని వివరాలకు 9441450639, 9100203323 నంబర్లలో సంప్రదించాలని సూచించింది.
AP: ప్రతి మండల కేంద్రంలో జనరిక్ ఔషధ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. 15 రోజుల్లో ఆయా షాపులకు లైసెన్సులు జారీ చేస్తామన్నారు. గత ప్రభుత్వం జనరిక్ మందులపై ఫోకస్ పెట్టలేదని, తాము మాత్రం వాటిపై అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు. దేశంలో 13,822 షాపులు ఉంటే ఏపీలో కేవలం 215 మాత్రమే ఉన్నాయన్నారు.
TG: మైనారిటీ అభ్యర్థుల కోసం డిసెంబర్‌లో గ్రూప్-2 నమూనా పరీక్షలు నిర్వహించనున్నట్లు మైనారిటీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ తెలిపారు. అన్ని జిల్లాల్లో మైనారిటీ సంక్షేమ అధికారుల పర్యవేక్షణలో ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. DEC 2, 3 తేదీల్లో తొలి నమూనా పరీక్ష, DEC 9, 10 తేదీల్లో రెండో నమూనా పరీక్ష ఉంటుందని చెప్పారు. ఈనెల 29లోగా అప్లై చేసుకోవాలని, వివరాలకు 040-23236112 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
భారత పారిశ్రామికవేత్త గౌతం అదానీ చిక్కుల్లో పడ్డారు. లంచం, ఫ్రాడ్ ఆరోపణలతో న్యూయార్క్‌లో ఆయనతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదైంది. 2 బిలియన్ డాలర్ల లాభం పొందేందుకు సోలార్ ఎలక్ట్రిసిటీ సప్లై కాంట్రాక్ట్ కోసం భారత అధికారులకు సుమారు 250 మిలియన్ డాలర్ల లంచం ఇచ్చినట్లు అభియోగాలు నమోదయ్యాయి. US ఇన్వెస్టర్ల నుంచి అక్రమంగా పెట్టుబడులు స్వీకరించారనే ఆరోపణలతో కోర్టు వారెంట్ జారీ చేసింది.
ఆన్‌లైన్‌లో ఔషధాలు ఆర్డర్ చేసే సదుపాయాన్ని కొందరు తప్పుడు పనులకు వాడుతున్నారని TN హెల్త్ సెక్రటరీ సుప్రియా సాహు DCGIకి సూచించారు. చట్టాలను ఉల్లంఘించి డ్రగ్స్, టపెంటడోల్‌ను విక్రయించే వెబ్‌సైట్స్‌ను నిషేధించాలని ఆమె లేఖ రాశారు. ఆన్‌లైన్ ద్వారానే నేరస్థులు డ్రగ్స్ కొంటున్నారని పోలీసులు గుర్తించినట్లు పేర్కొన్నారు. దీంతో మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని నిరోధించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
AP: ప్రజలతో నేరుగా మాట్లాడాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. 1995-2004 మధ్య డయల్ యువర్ సీఎం కార్యక్రమం నిర్వహించగా, అదే తరహాలో సంక్రాంతి నుంచి ప్రజలతో మీ ముఖ్యమంత్రి కార్యక్రమం చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిని ఆడియో/వీడియో విధానంలో ఎలా చేయాలన్న దానిపై అధికారులతో సీఎం సమాలోచనలు చేస్తున్నారు. త్వరలోనే దీనిపై పూర్తి వివరాలను ప్రభుత్వం వెల్లడించనుంది.
TG: CM రేవంత్ వేములవాడ పర్యటనలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. ఈ కార్యక్రమానికి దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి హోదాలో ఐటీ మినిస్టర్ శ్రీధర్‌బాబు సతీమణి శైలజారామయ్యార్ వచ్చారు. మంత్రులకు స్వాగతం పలికారు. తన భర్త శ్రీధర్‌బాబుకు సైతం ఆమె ఫ్లవర్ బొకే ఇచ్చి వెల్‌కం చెప్పారు. సీఎం రేవంత్‌కు స్వాగతం పలకగా ‘అన్నా.. వదిన’ అంటూ ఆయన నవ్వుతూ వారిని పలకరించారు. ‘ఫొటో బాగా దిగండి’ అని పొన్నం సైతం నవ్వులు పూయించారు.
AP: 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను నేరుగా కాలేజీలకే జమ చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ విద్యార్థులకు కేంద్రం నుంచి 60శాతం వాటా రావాల్సి ఉన్నందున వారికి మినహా మిగతా విద్యార్థుల ఫీజులను కాలేజీలకు జమ చేయనుంది. విద్యార్థుల హాజరు ఆధారంగా ఫీజులు విడుదలవుతాయని వెల్లడించింది. ఇప్పటివరకు ఏటా 3-4 విడతల్లో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజు డబ్బులు జమ అయ్యేవి.
Sorry, no posts matched your criteria.