India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జూబ్లీ ఉప ఎన్నిక కోసం EC మొత్తం 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో 50 శాతానికి పైగా 65 ప్రాంతాల్లోని 226 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా గుర్తించారు. హైదరాబాద్ పోలీసులు, కేంద్ర బలగాలు సంయుక్తంగా బందోబస్తు నిర్వహించనున్నాయి. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పారామిలటరీ బలగాలను మోహరించనున్నారు. NOV 14న ఓట్ల లెక్కింపు కోసం 42 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

రేపటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ స్టేడియం వేదికగా ఈవీఎంలు, వీవీప్యాట్ల డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు(+నోటా) బరిలో ఉండగా.. 4 బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తున్నారు. 3 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహించనున్నారు.

జూబ్లీహిల్స్‌లో ఓటు వేసే వారికి EC శుభవార్త చెప్పింది. సాధారణంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరిగేది. ఈసారి సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేసేందుకు ఈసీ అవకాశం ఇచ్చింది. 2023 సాధారణ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో రాష్ట్రంలోనే అత్యల్పంగా 47.49% శాతం మందే ఓటేశారు. ఈ పరిస్థితి మారాలని ఎన్నికల అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించారు. మన కోసం మరో గంట సమయం ఇచ్చారు. వెళ్లి ఓటేయండి.
SHARE IT

నిజాంపేట మున్సిపాలిటీలోని కోశల్యానగర్‌లో హైడ్రా కాపాడిన 300 గజాల బనియన్ ట్రీ పార్కులో స్థానికులు కార్తీకమాసం సందర్భంగా వనభోజనాలు నిర్వహించారు. ఆక్రమణదారులు కబ్జా చేసిన ఈ పార్కును హైడ్రా రక్షించి కాలనీవాసులకు అప్పగించింది. దీంతో కృతజ్ఞతగా వెయ్యి మంది నివాసితులు పార్కులో సత్యనారాయణ వ్రతం ఆచరించారు. పిల్లలు, పెద్దలు ‘హైడ్రా జిందాబాద్’ అంటూ నినాదాలు చేసి, ప్లకార్డులు ప్రదర్శించారు.

బుగ్గజాతర రూట్లో ఇవాళ అద్భుతమైన దృశ్యం ఆకట్టుకుంది. తాటిచెట్ల మధ్య సూర్యాస్తమయం కనువిందు చేసింది. చల్లటి గాలులతో కూడిన వాతావరణం జనాలని కట్టి పడేస్తుంది. పట్టణం నుంచి వచ్చే వారు గ్రామీణ వాతావరణంలో ఆనందంగా గడిపేస్తున్నారు. బుగ్గ జాతరకు వెళ్తే జాపాల, ఆరుట్ల, తిప్పాయిగూడ గ్రామాల మీదుగా రాచకొండ ఫోర్ట్‌ను సందర్శించండి. ఈ రూట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అస్సులు మరిచిపోలేరు.

వివిధ గమ్యస్థానాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ఆదివారం రాకపోకలు సాగించే మరో 3 విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీ నుంచి HYD రావాల్సిన విమానం, జైపూర్ నుంచి HYD రావల్సిన 2 విమానాలు రద్దయ్యాయి. అలాగే సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానాన్ని రద్దు చేసినట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి.

ఉగ్రదాడులకు ప్లాన్ చేసిన వారిలో హైదరాబాదీ మొహియుద్దీన్ ఉండటం చర్చనీయాంశమైంది. నిందితుడిని రాజేంద్రనగర్ ఫారెస్ట్ వ్యూస్ కాలనీలోని గుజరాత్ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా అతడు ఫ్రాన్స్‌లో MBBS పూర్తిచేసినట్లు తెలుస్తోంది. ఇంత చదివి ప్రజల ప్రాణాలు బలిగొనే ఉగ్రవాదంవైపు ఆకర్షితులవుతుండటంతో యువతరం ఏమైపోతోందని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఇంట్లో సోదాలు చేయగా గన్స్ దొరికాయి.

నగరంలో తొలి విడతలో 6 చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. చెరువుల ఆక్రమణలను తొలగించి 105 ఎకరాల నుంచి 180 ఎకరాలకు పెంచామన్నారు. ప్రభుత్వ, ప్రజల ఆస్తులను కొల్లగొడుతున్నవారు హైడ్రాపై దాదాపు 700 వరకు కేసులు పెట్టారని, 2024 జులైకి ముందు నుంచే నివాసం ఉన్న వారి ఇళ్ల జోలికి హైడ్రా వెళ్లదన్నారు.

11న జరిగే జూబ్లీహిల్స్ బైపోల్‌కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ తెలిపారు. ఉ.7 గం. నుంచి సా.6 గంటల వరకు పోలింగ్ ఉంటుందన్నారు. ‘10న సా. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం నుంచి EVM డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. 4 EVM మెషీన్లకు 3 అంచెల భద్రత ఉంటుంది. ఫ్లయింగ్ స్క్వాడ్స్ 45, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ 45, వీడియో టీమ్స్ 8, అకౌంటింగ్ టీమ్‌లు 2 ఉంటాయి’ అని ఆయన వెల్లడించారు.

బౌద్ధ భిక్షువులు ట్యాంక్ బండ్ బుద్ధ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి బుద్ధ వందనం సమర్పించారు. రాజధాని నడిబొడ్డున ప్రశాంత వాతావరణంలో చారిత్రక హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధుడిని సందర్శించి ప్రేరణ కలిగించడం ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరమని వారు పేర్కొన్నారు. హుస్సేన్‌సాగర్ బుద్ధ, ఇతర బౌద్ధారామాలు కలిపి పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలని వారు కోరారు.
Sorry, no posts matched your criteria.