Chittoor

News October 16, 2024

చిత్తూరు జిల్లాలో వర్షపాత వివరాలు

image

అల్పపీడన ప్రభావంతో మంగళవారం జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. అత్యధికంగా నింద్రలో 22.8 మిమీ, అత్యల్పంగా తపణంపల్లెలో 1.0 మిమీ వర్షం కురిసింది, మండలాల వారీగా రొంపిచెర్లలో 12, సదుంలో 9.6, పులిచెర్లలో 16.2, వెదురుకుప్పంలో 44, విజయపురంలో 5.4, నగరిలో 8.6, కార్వేటినగరంలో 5.4, పెనుమూరులో 3.6, పూతలపట్టులో 8.8, సోమలలో 12.6, చౌడేపల్లిలో 5.4, పుంగనూరులో 6.2మీ.మీ వర్షపాతం నమోదు అయింది.

News October 16, 2024

తిరుపతి: తమిళనాడు, కర్ణాటక వెళ్లే పలు రైళ్లు రద్దు

image

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో తిరుపతి నుంచి తమిళనాడు రాష్ట్రం మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. తిరుపతి- చెన్నై సెంట్రల్ (16203) తిరుపతి ఎక్స్‌ప్రెస్, తిరుపతి- చామరాజనగర్ (16220)కాట్పాడి మీదుగా కర్ణాటక రాష్ట్రానికి వెళ్లే రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు.

News October 15, 2024

తిరుపతి: రేపు కూడా పాఠశాలలకు సెలవు

image

తిరుపతి జిల్లాలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాల మేరకు బుధవారం పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ వి.శేఖర్ ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో కాలేజీలకు కూడా వర్తిస్తుందన్నారు.

News October 15, 2024

తిరుపతి, చిత్తూరు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులు వీరే

image

రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను నియమించింది. కేబినెట్‌‌లోని మంత్రులందరికీ కొత్త జిల్లాల వారీగా ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. తిరుపతి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా అనగాని సత్యప్రసాద్, చిత్తూరు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా రాంప్రసాద్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

News October 15, 2024

తిరుపతి జిల్లా వ్యాప్తంగా సైక్లోన్ కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల కురిసే భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడమైనదని కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్ తుఫాను కంట్రోల్ రూమ్ నెంబర్: 0877-2236007,గూడూరు కంట్రోల్ రూమ్ నెం: 8624252807,సూళ్లూరుపేట-8623295345,
తిరుపతి ఆర్డీఓ 7032157040,శ్రీకాళహస్తి ఆర్డీఓ-కంట్రోల్ రూమ్ నెం:9966524952

News October 15, 2024

చిత్తూరు: దుకాణాలు దక్కించుకున్న 12 మంది మహిళలు

image

104 మద్యం దుకాణాలకు నిర్వహించిన లాటరీలో జిల్లాలో 12 మంది మహిళలు దుకాణాలను దక్కించుకున్నారు. చిత్తూరులో యామిని, కీర్తన, బంగారుపాళ్యంలో పల్లవి (2 షాపులు), ఐరాలలో లక్ష్మి, వెదురుకుప్పంలో పార్వతి, శాంతమ్మ, బైరెడ్డిపల్లెలో భారతి, గుడుపల్లెలో ప్రభావతి, శాంతిపురంలో పుష్ప, రామకుప్పంలో ధనలక్ష్మి, పులిచెర్లలో సరస్వతి దుకాణాలను దక్కించుకున్నారు.

News October 15, 2024

చిత్తూరు: వైద్యులకు సెలవులు రద్దు

image

చిత్తూరు జిల్లాలో తుఫాను కారణంగా వైద్యాధికారులకు మూడు రోజులపాటు సెలవులు రద్దు చేసినట్లు డిఎంహెచ్వో ప్రభావతి దేవి తెలిపారు. వైద్యాధికారులతో సోమవారం జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులతో కలిసి పని చేయాలని సూచించారు. ఇంటింటి సర్వే చేపట్టి అనారోగ్య సమస్యల గుర్తించి తెలుసుకోవాలని ఆదేశించారు. డయేరియా పెరగకుండా చూసుకోవాలని చెప్పారు.

News October 15, 2024

తిరుపతి: ఏకగ్రీవంగా ఎన్నిక

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఐటిఐ కళాశాలల DLTC జనరల్ బాడీ ఎలక్షన్ సోమవారం ఏకగ్రీవంగా జరిగింది. జిల్లా ప్రెసిడెంట్ గా A. రాజు (ట్రైనింగ్ ఆఫీసర్ ప్రభుత్వ ఐటిఐ కళాశాల తిరుపతి), వరదరాజులు (వైస్ ప్రెసిడెంట్ 1), జనార్ధన్ (వైస్ ప్రెసిడెంట్ 2), సోమశేఖర్ (సెక్రటరీ), ధనలక్ష్మి (జాయింట్ సెక్రటరీ) మొత్తం 11 మంది సభ్యులతో కార్యవర్గం సభ్యులు ఎన్నికయ్యారు. అనంతరం వారికి డిక్లరేషన్ అందజేశారు.

News October 14, 2024

చిత్తూరుం 15 న ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు

image

ఈనెల 15వ తేదీన జరగనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం భారీ వర్షం కారణంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. 15, 16 తేదీల్లో పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. అన్ని పిహెచ్సిలో వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఎక్కడ ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చూడాలన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నెం: 9491077356 కు కాల్ చేయాలన్నారు

News October 14, 2024

చిత్తూరు: అసలైన అదృష్టవంతులు వీళ్లే..!

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని వైన్ షాపులకు ఇవాళ లాటరీ తీసిన విషయం తెలిసిందే. వేలాది మంది అప్లికేషన్లు వేయగా కొందరినే అదృష్టం వరించింది. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలో ఒకే దుకాణానికి అనుమతి ఇవ్వగా ఇక్కడ అత్యధికంగా 84 మంది పోటీపడ్డారు. అంతమందిలో వాసు అనే వ్యక్తికే షాపు దక్కింది. మరోవైపు మదనపల్లె పట్టణంలో ఇందిర అనే మహిళకు ఏకంగా రెండు షాపులు లాటరీలో తగిలిన విషయం తెలిసిందే.