India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రైస్ కార్డుల కోసం గుంటూరు జిల్లాలో 52,447 దరఖాస్తులు అందగా, వీటిలో 90% సమస్యలు పరిష్కారం అయ్యాయి. కొత్తగా 8 వేలకుపైగా కార్డులు మంజూరు అయ్యే అవకాశం ఉంది. అత్యధికంగా పేర్ల చేర్పు దరఖాస్తులే రావడం గమనార్హం. తెనాలి, గుంటూరు డివిజన్‌లలో అధిక స్పందన కనిపించింది. పేర్ల తొలగింపు, చిరునామా మార్పు, కార్డు విభజనలపై కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఇంకా 4,300లకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కి చురకలంటించారు. ‘తల్లికి వందనం’ లోకేశ్ ఆలోచన. ‘ఉచిత విద్యుత్’ బాబు ఆలోచన అని చెప్తూ అమాయకపు ప్రజల్లారా నమ్మండి.!’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా అంబటి మెసేజ్‌పై టీడీపీ, వైసీపీ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పరస్పరం మాటల యుద్దం జరుగుతుంది.
విభిన్న ప్రతిభను ప్రోత్సహించేందుకు గుంటూరు జిల్లాలోని 18ఏళ్ల లోపు విద్యార్థుల నుంచి రాష్ట్రీయ బాల పురస్కార్‌కు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కళలు, క్రీడలు, పర్యావరణం, సామాజిక సేవ, తదితర రంగాల్లో సామర్థ్యం చూపిన పిల్లలు జులై 31లోగా https://awards.gov.inలో అప్లై చేయాలని జిల్లా శిశు సంక్షేమ అధికారి ప్రసూన తెలిపారు. కేంద్రం నిర్వహించే ఈ అవార్డు ప్రతిభకు గుర్తింపు కల్పించనుందన్నారు.
మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ముత్యాల పందిరి వాహనం ఉత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. ధ్వజస్తంభం వద్ద ఊరేగింపుగా బయలుదేరిన క్రమంలో వాహనం ఒక్కసారిగా ఒరిగిపోయింది. దేవస్థాన సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి, ఉత్సవ విగ్రహాలు కింద పడకుండా కాపాడారు. ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జాతీయ చేపల రైతుల దినోత్సవాన్ని గురువారం గుంటూరులో ఘనంగా నిర్వహించారు. మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఆక్వా రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మత్స్య శాఖ సైంటిస్ట్ హీరా లాల్ మాట్లాడారు. మంచినీటిలో చేపలను పెంచడం ద్వారా ఉత్పత్తిలో మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. తద్వారా ఎగుమతులు ఆశాజనకంగా ఉంటాయని ఆయన వెల్లడించారు. ఆక్వా రంగంలో ఎగుమతులు పెరిగే విధంగా అన్ని చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.
స్తంభాల గరువుకు చెందిన కరిముల్లా హత్య కేసును పోలీసులు ఛేదించారు. పోలీసుల వివరాల మేరకు.. కరిముల్లా దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో అతని భార్య కరిముల్లా వదిన వద్ద ఉంటుంది. అతని వదినకు స్థానికంగా ఉండే ఓ ఫైనాన్షియర్‌తో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయమై హత్యకు గురైన వ్యక్తి ఆ ఫైనాన్షియర్‌పై కక్ష పెంచుకున్నాడు. దీంతో ఫైనాన్షియర్ మరో వ్యక్తి సహాయంతో అరటిగెల కోసే కత్తితో కరిముల్లాను హత్య చేయించాడని చెప్పారు.
భారతీయ బహుజన ప్రజా రాజ్యం పార్టీకి షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ తెలిపారు. గత 6 సంవత్సరాలుగా వరుసగా ఎన్నికల్లో పోటీ చేయని కారణంగా గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు ఈసీ
నోటీసులు జారీ చేసిందని చెప్పారు. ఎందుకు పోటీ చేయలేదనే అంశాలపై 6 రోజుల్లో లిఖిత పూర్వకంగా ప్రధాన ఎన్నికల అధికారికి వివరణ ఇవ్వాలని ఆ నోటీసులలో ఆదేశాలు ఉన్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
గుంటూరు శివ నాగరాజు కాలనీలో గంజాయి విక్రయిస్తున్న గోపి, కార్తికేయలను ఎక్సైజ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. సీఐ లతా తెలిపిన వివరాల ప్రకారం.. పక్కా సమాచారంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 253 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను స్టేషన్‌కు తరలించారు. ఈ ఆపరేషన్‌లో ఎస్ఐలు షరీఫ్, తిరుమలేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
జనసేన పార్టీలోకి ఆర్యవైశ్య ప్రముఖులు చేరారు. బుధవారం మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో చార్టెడ్ అకౌంటెంట్, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షుడు పెనుగొండ సుబ్బారాయుడు, వైశ్యసత్ర సముదాయం అధ్యక్షుడు దేవకీ వెంకటేశ్వర్లు, శ్రీకాశీ అన్నపూర్ణ చౌల్ట్రీస్ అధ్యక్షుడు భవనాసి శ్రీనివాస్ పార్టీ కండువా కప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ వారికి సాదరంగా స్వాగతం పలికారు.
జనసేన పార్టీలోకి ఆర్యవైశ్య ప్రముఖులు చేరారు. బుధవారం మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో చార్టెడ్ అకౌంటెంట్, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షుడు పెనుగొండ సుబ్బారాయుడు, వైశ్యసత్ర సముదాయం అధ్యక్షుడు దేవకీ వెంకటేశ్వర్లు, శ్రీకాశీ అన్నపూర్ణ చౌల్ట్రీస్ అధ్యక్షుడు భవనాసి శ్రీనివాస్ పార్టీ కండువా కప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ వారికి సాదరంగా స్వాగతం పలికారు.
Sorry, no posts matched your criteria.