India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులకు సూచించారు. సోమవారం మెదక్ పట్టణంలోని జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని పలువురు దరఖాస్తు దారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈకార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, దరఖాస్తు దారులు, తదితరులు పాల్గొన్నారు.
మెదక్ జిల్లాలోని ఓపెన్ స్కూల్లో పది, ఇంటర్‌లో ప్రవేశం పొందేందుకు ఈనెల 31 వరకు గడువు పొడగించినట్లు జిల్లా విద్యాధికారి రాధాకిషన్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధ్యలో చదువు ఆపేసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇతర వివరాల కోసం స్థానికంగా ఉండే ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్‌లో సంప్రదించాలన్నారు.
గజ్వేల్ ఎమ్మెల్యే ఆఫీసును కాంగ్రెస్ శ్రేణులు ముట్టడించారు. నియోజకవర్గంలో చాలా రోజులుగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఏఎంసీ ఛైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. చెక్కుల పంపిణీ చేయాలని సహకారం ఇవ్వాలని కోరుతూ.. కేసీఆర్ చిత్రపటానికి వినతిపత్రం ఇచ్చారు. వైస్ ఛైర్మన్ సర్దార్ ఖాన్, మున్సిపల్ మాజీ ఛైర్మన్ భాస్కర్ తదితరులు ఉన్నారు.
మెదక్ మండలం పాతూర్‌కు చెందిన ఆకుల రాజు(48) కుమార్తె కొడుకు HYDలోని ఓ ఆస్పత్రిలో చేరాడు. శనివారం రాత్రి మనవడిని పరామర్శించి బైక్‌పై తిరిగి ఇంటికి వెళ్తుండగా హైవే-765Dపై కౌడిపల్లి శివారులో ట్రాక్టర్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ రాజును చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఘటనపై కేసు నమోదైనట్లు SI రంజిత్ రెడ్డి తెలిపారు.
సంపూర్ణ రుణమాఫీ చేశారని ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి రాసిన లేఖను మాజీ మంత్రి హరీష్ రావు తప్పుబట్టారు. తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ చేసిందని చెప్తూ రేవంత్ రెడ్డి దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడన్నారు. ఎస్బీఐ బ్యాంకులోనే 5,06,494 మంది అంటే దాదాపు 50% మంది రైతులకు రుణమాఫీ అవ్వలేదని ఆధారాలతో బయటపెట్టారు.
తెలంగాణలో బతుకమ్మ పండుగకు ముందు నామినేటెడ్ పోస్టుల భర్తీ జాతర మొదలైంది. తాజాగా రాష్ట్రంలోని పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్‌లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా గ్రంథాలయ బోర్డు ఛైర్‌పర్సన్‌గా చిలుముల సుహాసిని రెడ్డి, సంగారెడ్డి జిల్లా గ్రంథాలయ బోర్డ్ ఛైర్మన్‌గా గొల్ల అంజయ్యను నియమించింది.
తెలంగాణలో బతుకమ్మ పండుగకు ముందు నామినేటెడ్ పోస్టుల భర్తీ జాతర మొదలైంది. తాజాగా రాష్ట్రంలోని పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్‌లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా గ్రంథాలయ బోర్డు ఛైర్‌పర్సన్‌గా చిలుముల సుహాసిని రెడ్డి, సంగారెడ్డి జిల్లా గ్రంథాలయ బోర్డ్ ఛైర్మన్‌గా గొల్ల అంజయ్యను నియమించింది.
సంగారెడ్డి జిల్లాలోని రైతులకు 18వ విడత పీఎం కిసాన్ నిధులు రైతులకు సంబంధించిన ఖాతాలలో జమ అయ్యాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నిధులను వ్యవసాయ పనులకు వినియోగించుకోవడానికి ఉపయోగపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు నిధులు జమ కావడంతో సంతోషం వ్యక్తం చేశారు.
కంగ్టి మండలంఎడ్ల రేగడి తండాలోని జ్వాలాముఖి ఆలయాన్ని దసరా పండుగకు ముస్తాబు చేసినట్టు ఆలయ ప్రధాన పూజారి శ్రీ మంగళ్ చంద్ మహారాజ్ తెలిపారు. సోమవారం నుంచి బుధవారం వరకు జాతర ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల నుండి అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొంటారని పేర్కొన్నారు. మంగళవారం జ్వాలాముఖి దేవికి హోమం కార్యక్రమం ఉంటుందని తెలిపారు.
దసరా సెలవుల దృష్ట్యా పిల్లల భద్రత పట్ల తల్లితండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ అనురాధ సూచించారు. నేటి బాలలే రేపటి పౌరులని, భవిష్యత్తు భారతావనికి వారే పునాదులని, వారిని కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదన్నారు. ప్రతి సంవత్సరం దసరా సెలవుల్లో ఎంతో మంది అమాయక విద్యార్థులు ఆకారణంగా ప్రాణాలు పోగొట్టుకొని కన్నా వారికీ కడుపుకోత మిగిలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.