India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సి. సుదర్శన్ రెడ్డి తెలంగాణలోని అన్ని ఈఆర్ఓలు, ఏఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటరు జాబితా ప్రత్యేక తీవ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం పురోగతిని, పెండింగ్‌లో ఉన్న ఎన్నికల సంబంధిత అంశాలను ఆయన సమీక్షించారు. ఈ కాన్ఫరెన్స్‌లో కరీంనగర్ కలెక్టరేట్ నుండి అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ పాల్గొన్నారు.

కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం శనివారం కేశవపట్నం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఠాణా పనితీరు, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిని, వాటికి సంబంధించిన కేసు డైరీలను పరిశీలించారు. దర్యాప్తు వేగవంతం చేయాల్సిన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్న అనంతరం, ఠాణా అధికారి ఎస్సై శేఖర్‌కు సీపీ కీలక ఆదేశాలు జారీ చేశారు.

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని జిల్లా సంక్షేమ అధికారి కె.సబిత కుమారి తెలిపారు. నవంబర్ 17న జిల్లా పరిషత్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం, 18న మండలాల్లో ఆరోగ్య శిబిరాలు, 19న కలెక్టరేట్లో ప్రధాన దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని వయోవృద్ధులు ఈ కార్యక్రమాలలో అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆమె సూచించారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఫైన్ చెల్లించలేనన్న మనోవేదనతో చొప్పదండి బీసీ కాలనీకి చెందిన సూర విజయ్ (28) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ నరేష్ రెడ్డి తెలిపారు. ఈ నెల 1న పోలీసులకు పట్టుబడిన విజయ్, శనివారం కోర్టుకు హాజరైనప్పటికీ మేజిస్ట్రేట్ లేకపోవడంతో తిరిగి వచ్చాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఫైన్ భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విటమిన్ గార్డెన్లపై బయోసైన్స్ ఉపాధ్యాయులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. హౌసింగ్ బోర్డు కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించి, మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. గార్డెన్లను ఆకర్షణీయంగా ఏర్పాటు చేయడంతో పాటు, పండిస్తున్న కూరగాయలు, ఆకుకూరల్లోని విటమిన్లు, మినరల్స్ గురించి కూడా విద్యార్థులకు వివరించాలని ఆమె సూచించారు.

కుక్కలు, కోతులు కరిచిన వారికి అందిస్తున్న చికిత్సపై ప్రత్యేక పర్యవేక్షణ అవసరమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శనివారం హౌసింగ్ బోర్డు కాలనీలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె సందర్శించారు. చికిత్స కోసం వచ్చిన వృద్ధులతో మాట్లాడి, వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు మందులు ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా ఇస్తారని వారికి సూచించారు.

72వ జాతీయ సహకార వారోత్సవాల సందర్భంగా జిల్లా సహకార అధికారి కార్యాలయంలో గృహ నిర్మాణ సహకార సంఘాల అధ్యక్షులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సహకార అధికారి రామానుజాచార్య మాట్లాడుతూ.. అర్హుల ఎంపికలో పారదర్శకత పాటించాలని, నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. సహకార వ్యవస్థ ప్రజలకు అందుబాటులో ఉండేలా సంఘాలు సేవాభావంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

తమ కార్యాలయ పరిధిలో కొంతమంది పోలీసులు నెంబర్‌ప్లేట్ లేని వాహనాలు, హెల్మెట్/సీట్‌బెల్ట్ ధరించకపోవడం, బ్లాక్ ఫిల్మ్ వాడటం వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలు చేస్తున్నట్లు గుర్తించిన సీపీ, కట్టుదిట్టమైన చర్యలకు ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేవారికి, పోలీసులు అయినా సరే, కఠినంగా ఈ-చలాన్లు జారీ చేయాలని ఏసీపీ ట్రాఫిక్‌కు ఆయన స్పష్టం చేశారు.

కరీంనగర్ భరోసా కేంద్రాన్ని సీపీ గౌష్ ఆలం సందర్శించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. బాధిత మహిళలకు భరోసా కల్పించడంలో ఈ కేంద్రం కీలకపాత్ర పోషిస్తుందని, భరోసా కేంద్రం ఏర్పాటు చేసినప్పటినుండి బాధితులకు అందించిన సేవలు, వాటి సత్ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఒకే చోట న్యాయ సహాయం, వైద్యం, సైకోథెరపీ అందించే లక్ష్యంతో పనిచేస్తుందన్నారు.

విద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దానిని సాధించేందుకు నిత్యం కఠోరంగా శ్రమించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆమె మాట్లాడుతూ.. బాలబాలికలు అనవసర విషయాలను పట్టించుకోకుండా, తమ ధ్యాసనంతా చదువుపైనే కేంద్రీకరించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.