WestGodavari

News July 8, 2025

తాడేపల్లిగూడెం: మద్యం తక్కువ పోశాడని హత్య

image

తాడేపల్లిగూడెం పాత రేలంగి చిత్ర మందిర్ సమీపంలో రెడ్డి గోవింద్ హత్య కేసులో నిందితుడైన గుబ్బల మల్లేశ్వరరావు (53)ను సోమవారం నరసింహారావుపేటలోని అతని ఇంటి వద్ద అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ ఆదిప్రసాద్ తెలిపారు. మద్యం తక్కువ పోశాడని ప్రశ్నించడంతో నిందితుడు మల్లేశ్వరరావు రాయితో గోవింద్ తలపై కొట్టి పారిపోయినట్లు విచారణలో తేలిందని సీఐ వివరించారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు.

News July 8, 2025

మెగా పేరెంట్స్ మీట్‌కు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

జిల్లాలో మెగా పేరెంట్స్‌, టీచర్స్‌ మీట్ ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆమె మాట్లాడారు. జిల్లాలోని 1,920 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 2,79,204 మంది విద్యార్థుల తల్లిదండ్రులు, అలాగే 121 ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో 37,124 మంది విద్యార్థుల తల్లిదండ్రులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తున్నామని అన్నారు.

News July 8, 2025

ప.గో: 1,612 సెల్‌ఫోన్‌ల రికవరీ: ఎస్పీ

image

ప.గో జిల్లావ్యాప్తంగా వివిధ విడతల్లో ఇప్పటివరకు సుమారు రూ.2.40 కోట్ల విలువైన మొత్తం 1,612 సెల్‌ఫోన్‌లను రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. పదవ విడతలో భాగంగా సుమారు రూ.31 లక్షల విలువైన 208 మొబైల్ ఫోన్‌లను బాధితులకు తిరిగి అప్పగించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

News July 7, 2025

పాలకోడేరు: పీజీఆర్ఎస్‌కు 15 అర్జీలు

image

పాలకోడేరు మండలం గొల్లలకోడేరులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని, అర్జీలు పునరావృతం కాకుండా నిర్ణీత గడువులోగా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపుతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో 15 అర్జీలు స్వీకరించినట్లు ఎస్పీ తెలిపారు.

News July 7, 2025

ప్రతి విద్యార్థికి ఒక మొక్క అందజేత: కలెక్టర్

image

‘ఏక్ పెడ్ మా కే నామ్’ కార్యక్రమంలో భాగంగా ప్రతి విద్యార్థికి ఒక మొక్కను అందజేసి, వారి తల్లి పేరున పెంచేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆమె ఈ విషయంపై మాట్లాడారు. ఇందుకోసం ‘లీప్ యాప్’ను రూపొందించి, అందులో విద్యార్థులు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.

News July 7, 2025

జిల్లాలో ఎరువుల కొరత లేదు: జేసీ

image

పశ్చిమ గోదావరి జిల్లాలో ఎటువంటి ఎరువుల కొరత లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ సోమవారం తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 44,792 మెట్రిక్ టన్నుల ఎరువులు ప్రైవేటు, ఏపీ మార్కెట్ వద్ద అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రైతులకు కావలసిన మొత్తం ఎరువులు లభ్యంగా ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జేసీ రాహుల్ స్పష్టం చేశారు.

News July 7, 2025

భీమవరం: పీజీఆర్‌ఎస్‌‌కు 165 అర్జీలు

image

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 165 అర్జీలు అందినట్లు ఆమె తెలిపారు. వీటిని సంబంధిత అధికారులకు పంపి, పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి, డీఆర్‌ఓ వెంకటేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు.

News July 7, 2025

ప్రతి విద్యార్థి అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలి: కలెక్టర్

image

ప్రతి విద్యార్థి అమ్మ పేరుతో ఒక మొక్క నాటే కార్యక్రమం చేపట్టాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. ఆదివారం పెద అమిరంలోని జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ, జేసీ, డీఆర్ఓ, ఆర్డీవోలు, జిల్లా విద్యాశాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రతి విద్యార్థి చేత అమ్మ పేరుతో ఒక మొక్కను నాటించే ఏర్పాటు చేయాలని అన్నారు.

News July 6, 2025

కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోండి: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం తెలిపారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో పీజీఆర్ఎస్ ద్వారా అధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తారన్నారు. ఉదయం 10 గంటల నుంచి 1.30 వరకు పీజీఆర్ఎస్ జరుగుతుందన్నారు. అలాగే మీకోసం కాల్ సెంటర్ 1100 నంబర్‌కు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News July 6, 2025

పేరెంట్స్ టీచర్స్ మీట్ పండుగలా నిర్వహించాలి: కలెక్టర్

image

ఈనెల 10న జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలో “మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్” పండుగలా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదివారం ప్రకటన ద్వారా తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆదేశాలతో ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులకు ఆహ్వానం అందించాలని సూచించారు. ప్రతి స్కూల్లోనూ తల్లులకు పాదపూజ చేయించాలని తెలిపారు.