India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రంగారెడ్డి జిల్లాలో జనాభా శరవేగంగా పెరుగుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 24,46,265 మంది ఉండగా.. వీరిలో 12,54,184 మంది పురుషులు,11,92,081 మంది మహిళలు ఉన్నారు. 2023 నవంబర్‌లో ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం 18 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 35,23,219కు చేరింది. జిల్లా పరిశ్రమలతో పాటు రియల్ ఎస్టేట్ రంగాల్లో అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో 13 ఏళ్లలో జనాభా 48 లక్షలకు చేరిందని అంచనా.
కూకట్‌పల్లిలో కల్తీ కల్లు తాగిన ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఇప్పటివరకు తులసీ రామ్, చాకలి బొజయ్య, నారాయనమ్మ, స్వరూప (56)తో కలిపి నలుగురు మృతి చెందారు. కల్తీ కల్లు తాగడంతో నిన్న సాయంత్రం నుంచి అస్వస్థతకు గురై 19 మంది ఆస్పత్రిలో చేరారు. బాధితులందరినీ నిమ్స్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ కాసేపటి క్రితం ఆమె మృతి చెందింది. మృతుల సంఖ్య పెరగుతుండటంతో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
GST రిజిస్ట్రేషన్ కోసం రూ.8 వేలు లంచం డిమాండ్ చేసిన మాదాపూర్ సర్కిల్ డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ సుధారెడ్డి ACB అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నాంపల్లి గగన్ విహార్‌లోని కార్యాలయంలో ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా అధికారులు దాడుల చేశారు. కంపెనీ అభ్యర్థనపై రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం లంచం కోరినట్లు గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వీ కర్ణన్ అన్నారు. శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వైద్యారోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన వర్క్ షాప్‌లో ఆయన మాట్లాడారు. అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ డిప్లొమా ఇన్ ఎర్లీ ఇంటర్వెన్షన్ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలతో పాటు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సు సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవాలని సూచించారు.
హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భువనేశ్వరినగర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. అబ్దుల్ ఖాదర్ జిలానీ ఇంట్లో దోమల కోసం పెట్టిన మస్కిటో కాయిల్ అతని కుమారులు అబ్దుల్ రెహమాన్ (4), అతిఫా(4) పడుకున్న పరుపు పై పడింది. నిప్పు అంటుకోవడంతో పరుపు పూర్తిగా కాలిపోగా.. ఆ పొగతో ఊపిరి ఆడక రెహమాన్ మృతి చెందాడు. అతిఫా అస్వస్థతకు గురికాగా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం 108వ స్థాపనా దినోత్సవాన్ని వేడుకలు ఇవాళ ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో MLC ప్రొ.కోదండరాం, మాజీ ఎంపీ K.కేశవరావు, సీపీ CV ఆనంద్, గాయకుడు అందెశ్రీ, వీసీ ప్రొ.కుమార్ మోలుగారం పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి.
HYDలో వ్యభిచార స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత 48 గంటల్లో 3 చోట్ల ఈ ముఠాలకు చెక్ పెట్టారు. గురువారం బంజారాహిల్స్‌లో ఇద్దరు యువతులతో విటులు పట్టుబడ్డారు. శుక్రవారం లాలాగూడలో వ్యభిచారం చేయిస్తూ ఉగండా దేశస్థులు చిక్కారు. శ్రీనగర్‌కాలనీలోని ఓ స్పా సెంటర్‌లో తనిఖీ చేయగా ఆరుగురు యువతులతో వ్యభిచారం చేయిస్తున్నట్లు తేలింది. అసాంఘిక కార్యకలాపాలపై చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఉగ్రదాడి అనంతరం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థాన్ జాతీయులను వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించింది. ఇటువంటి సమయంలో పాకిస్థాన్ యువకుడు ఫయాజ్ హైదరాబాద్‌లో అరెస్ట్ అయ్యాడు. నగర యువతిని పెళ్లి చేసుకున్న ఫయాజ్ ఎటువంటి వీసా లేకుండా నేపాల్ మీదుగా ఇండియాలోకి అక్రమంగా చొరబడ్డాడు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించి అతడిని అరెస్ట్ చేశారు. పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.
HYD స్థానిక సంస్థల MLC కోటాలో ‘ఆ ఒక్క ఓటు’ ఆసక్తిని రేపుతోంది. 22 ఏళ్ల తర్వాత MIM మీద BJP పోటీ చేసింది. BRS పోలింగ్‌లో పాల్గొనలేదు. BJP 24, INC 14, MIM 50 మంది సభ్యులు ఓటేశారు. ఇందులో MIMకు 63 ఓట్లు పోలయ్యాయి. BJPకి 25 ఓట్లు రావడం చర్చనీయాంశమైంది. 24 మంది సభ్యుల సొంత ఓట్లకు అదనంగా మరో ఓటు పడింది. ఇంతకీ ఏ పార్టీ నుంచి మద్దతు వచ్చింది? BJPకి ఓటేసిన ఆ సభ్యుడు ఎవరు? అనేది హాట్ టాపిక్‌గా మారింది.
Sorry, no posts matched your criteria.