Telangana

News July 11, 2025

WGL: పెరిగిన మొక్కజొన్న, పసుపు ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం వివిధ రకాల చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు బిల్టీ క్వింటా గురువారం రూ.2,430 పలకగా.. ఈరోజు రూ.2,470 పలికింది. అలాగే పసుపు నిన్న
రూ.12,259 ధర రాగా నేడు రూ.12,459 ధర వచ్చింది. అలాగే సూక పల్లికాయకి ధర రూ.6,300 రాగా.. పచ్చి పల్లికాయకి రూ.3,550 ధర వచ్చిందని అధికారులు తెలిపారు.

News July 11, 2025

JNTUHలో డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్

image

జేఎన్టీయూ హైదరాబాద్ & జర్మనీలో టాప్-3లో ఉన్న Reutlingen పబ్లిక్ యునివర్సిటీ కలసి సంయుక్తంగా అందిస్తున్న 3 ఇంటర్నేషనల్ డిగ్రీ కోర్సులలో అడ్మిషన్లు మొదలయ్యాయి. జేఈఈ, టీజీఎంసెట్, గేట్ & టీజీపీజీసెట్ రాసిన విద్యార్థులు www.jntuh.ac.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. కోర్సులో ఎంపికైన విద్యార్థులకు స్కాలర్షిప్ ఉంటుంది. వారానికి 20 గంటల పనికి పర్మిషన్, 18 నెలల వర్క్ పర్మిట్ కూడా లభిస్తుంది.

News July 11, 2025

HYD: పీ.వీ.రమణ పురస్కారానికి దరఖాస్తుల ఆహ్వానం

image

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో రంగస్థల కళలశాఖ ప్రతి సంవత్సరం ‘పీ.వీ.రమణ రంగస్థల స్మారక పురస్కారం’ ప్రదానం చేయనున్నారు. 2024-25 సంవత్సరానికిగాను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు యూనివర్సిటీ ఓ సర్కులర్ విడుదల చేసింది. ఆగస్టు 1లోగా రంగస్థలంలో కృషి చేసిన నటులు, సాంకేతిక నిపుణులు అర్హులైన వారు తెలుగు విశ్వవిద్యాలయం బాచుపల్లి ప్రాంగణంలో తమ బయోడేటాతో దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు.

News July 11, 2025

మెదక్: ప్రభుత్వ పాఠశాలలకు గుడ్ల బడ్జెట్ విడుదల

image

మెదక్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు అందిస్తున్న గుడ్లకు బడ్జెట్ విడుదలైందని DEO రాధా కిషన్ తెలిపారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొన్నారు. జిల్లాకు రూ.26,97,786 విడుదల చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే సంబంధించిన ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపారు.

News July 11, 2025

NZB: కలెక్టర్ గారూ.. ఆ PAపై చర్యలు తీసుకోండి

image

సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును బేఖాతారు చేస్తూ ప్రజా ప్రతినిధికి పర్సనల్ అసిస్టెంట్(PA)గా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయుడిపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని మహాజన సోషలిస్ట్ పార్టీ(MSP) NZB జిల్లా అధ్యక్షుడు సరికేల పోశెట్టి మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ధర్పల్లి మండలం మైలారం ZPHSలో స్కూల్ అసిస్టెంట్‌గా ఉన్న గడ్డం శ్రీనివాస్ రెడ్డి సెలవులు పెడుతూ PAగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

News July 11, 2025

HYD: చైల్డ్ పోర్న్ వీడియోలపై 22కేసులు నమోదు

image

HYD సైబర్ క్రైమ్ పోలీసులు వివిధ కేసుల్లో మొత్తం 25 మందిని అరెస్టు చేసి రూ.3.67కోట్లను బాధితులకు రిఫండ్ చేశారు. పట్టుబడిన నేరగాళ్లపై దేశవ్యాప్తంగా 453 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని వాటి సంఖ్య 66‌గా ఉంది. ఈ క్రమంలో చైల్డ్ పోర్న్ వీడియోల కేసుల్లోనూ సైబర్ క్రైమ్ పోలీసులు 22 కేసులు నమోదు చేశారు.

News July 11, 2025

HYD: సివిల్స్ మెయిన్స్ అభ్యర్థులకు ముఖ్య గమనిక

image

యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పాసై మెయిన్‌‌కు అర్హత సాధించిన అభ్యర్థులకు సింగరేణి సంస్థ గుడ్ న్యూస్ ప్రకటించింది. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి గడువు పొడిగించింది. ఈనెల 12 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సంస్థ సీఎండీ బలరాం తెలిపారు. ఈ పథకం కింద అభ్యర్థులకు రూ.లక్ష ఆర్థికసహాయం అందజేస్తామన్నారు.

News July 11, 2025

NLG: ఫెయిలైన అభ్యర్థులకు మరో అవకాశం

image

టీటీసీ కోర్సు పూర్తిచేసినవారు, గతంలో పరీక్షల్లో ఫెయిలైన అభ్యర్థుల కోసం ఆగస్టు 3న (ఆదివారం) థియరీ పరీక్ష జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్టు డీఈవో బిక్షపతి తెలిపారు. ఉదయం 11:00 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు సబ్జెక్టుల వారీగా పరీక్షలు జరుగుతాయని అన్నారు. పరీక్షా కేంద్రాలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్లతో గంట ముందుగా హాజరుకావాలని సూచించారు.

News July 11, 2025

MBNR: పి.వి.రమణ పురస్కారానికి దరఖాస్తుల ఆహ్వానం

image

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో రంగస్థల కళలశాఖ ప్రతి సంవత్సరం ‘పి.వి.రమణ రంగస్థల స్మారక పురస్కారం’ ప్రదానం చేయనున్నారు. 2024-25 సంవత్సరానికి గాను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు యూనివర్సిటీ ఓ సర్కులర్ విడుదల చేసింది. ఆగస్టు 1లోగా రంగస్థలంలో కృషి చేసిన నటులు, సాంకేతిక నిపుణులు అర్హులైన వారు తెలుగు విశ్వవిద్యాలయం బాచుపల్లి ప్రాంగణంలో తమ బయోడేటాతో దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు.

News July 11, 2025

SRSP UPDATE: 20.318 TMCల నీటి నిల్వ

image

SRSP ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (80.5 TMC) అడుగులకు గాను శుక్రవారం ఉదయానికి 20.318 TMC (1068.10 అడుగులు)ల నీటి నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో ప్రాజెక్టుకు 4,309 క్యూసెక్కుల నీరు వచ్చి చేరగా కాకతీయ కాలువ ద్వారా 100, మిషన్ భగీరథ ద్వారా 231, ఆవిరి రూపంలో 231 క్యూసెక్కుల నీరు పోతున్నదన్నారు.