Telangana

News April 20, 2026

మహబూబ్‌నగర్: ఇంటి వద్దనే ఎఫ్‌ఐఆర్: ఎస్పీ

image

మహబూబ్‌నగర్ జిల్లాలో బాధితులు పోలీస్ స్టేషన్‌కు రాకుండానే ఇంటి నుంచే ఫిర్యాదు చేసే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందని ఎస్పీ జానకి తెలిపారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, మైనర్లకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ బృందాలకు ఆదేశాలు జారీ చేశామని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

News April 20, 2026

ADB: ఓపెన్ ఇంటర్, టెన్త్ పరీక్షలు.. 177 మంది గైర్హాజరు

image

TOSS ఓపెన్ ఇంటర్ టెన్త్ పరీక్షలు సోమవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. జిల్లాలో పదో తరగతికి 4 ఇంటర్‌కు 3 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పది పరీక్షకు 548 విద్యార్థులకు గాను 410 మంది హాజరై 130 మందికి గైర్హాజరయ్యారు. అలాగే ఇంటర్‌కు 461 మంది విద్యార్థులకు గాను 414 మంది విద్యార్థులు హాజరై 47 మంది గైర్హాజరయ్యారని అధికారులు తెలిపారు.

News April 20, 2026

HYDలో త్వరలో మరో IVF సెంటర్

image

HYD హైకోర్టు సమీపంలోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో త్వరలో IVF కేంద్రం అందుబాటులోకి రానుంది. గాంధీ ఆసుపత్రిలో IVF సెంటర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఇక్కడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు DME నరేందర్ కుమార్ తెలిపారు. సుమారుగా 490 పడకల సామర్థ్యంతో, డాక్టర్లతో అద్భుతమైన సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రెగ్నెన్సీ పరీక్షలు చేయడం, పసిపిల్లలకు వైద్యం, పిల్లల తల్లులకు అడ్వాన్స్‌డ్ వైద్యం అందించనున్నారు.

News April 20, 2026

HYD: భారీగా పెరిగిన గుడ్ల ధరలు

image

HYDలో కోడి గుడ్ల ధరలు భారీగా పెరిగాయి. 10రోజుల క్రితం ₹140 ఉన్న ధరలు ఒక్కసారిగా ఎగబాకి వినియోగదారులకు భారంగా మారాయి. ప్రస్తుతం ఉప్పల్, తార్నాక, ఎల్బీనగర్, కాచిగూడ ప్రాంతాల్లో 30 గుడ్లు ₹170- ₹185 వరకు అమ్ముడవుతున్నాయి. డిమాండ్ పెరగడం, సరఫరా తగ్గడం ప్రధాన కారణాలుగా వ్యాపారులు చెబుతున్నారు. ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మీ ఏరియాలో గుడ్ల రేట్లు పెరిగాయా? కామెంట్ చేయండి.

News April 20, 2026

RR: కుర్చీలు ‘వెయిటింగ్’.. జనం ‘రోస్టింగ్’

image

కొన్ని రోజులుగా ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో ప్రజలు త్వరగా పనులు ముగించుకొని ఇల్లు చేరాలనుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఫిర్యాదుల కోసం వచ్చే ప్రజలు ఉ.10 నుంచి పడిగాపులు కాస్తున్నారు. ఉ.11 గంటలు దాటినా అధికారులు రాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు సమయపాలన పాటిస్తే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన తిరిగి వెళ్లడానికి ఆస్కారం ఉంటుందని అంటున్నారు.

News April 20, 2026

ఎర్రుపాలెం–అమరావతి రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్

image

ఎర్రుపాలెం నుంచి అమరావతి వరకు కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఖమ్మం జిల్లాలో ఎర్రుపాలెం, కేసిరెడ్డిపల్లి గ్రామాల్లో సుమారు 23 ఎకరాల భూసేకరణ పూర్తయ్యింది. మార్కెట్ విలువకు ఐదు రెట్లు పరిహారం ఇవ్వడంతో రైతులు సుముఖత చూపారు. మొత్తం రూ.2,515 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. రైల్వే లైన్ పూర్తయితే రవాణా, వ్యాపార రంగాలకు ఊతం లభించనుంది.