Nellore

News July 11, 2025

అక్టోబర్ 1కి అన్నీ పనులు ప్రారంభం: మంత్రి నారాయణ

image

నెల్లూరులోని అభివృద్ధి పనులపై టీడీపీ నేతలు, కార్పొరేషన్ అధికారులతో మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. నగర కార్పొరేషన్లో రూ.830 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టబోతున్నామన్నారు. ఇప్పటికే డ్రైన్లలో పూడికతీత పనులు జరుగుతున్నాయన్నారు. అక్టోబర్ 1వ తేదీ కల్లా అన్ని పనులు ప్రారంభం అవుతాయని చెప్పారు.

News July 11, 2025

నెల్లూరులో ప్రారంభమైన రెవెన్యూ క్రీడా వారోత్సవాలు

image

నెల్లూరు జిల్లా రెవెన్యూ అసోసియేషన్ 10వ క్రీడా వారోత్సవాలను జిల్లా జడ్జి శ్రీనివాసులు, కలెక్టర్ ఆనంద్ ప్రారంభించారు. శుక్రవారం ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, క్రీడాజ్యోతిని వెలిగించి ఆటలను ప్రారంభించారు. మూడు రోజులుపాటు ఈ క్రీడా వారోత్సవాలు జరగనున్నాయి. ఈ పోటీల్లో నెల్లూరు, ఆత్మకూరు, కావలి, కందుకూరు డివిజన్లలోని రెవెన్యూ సిబ్బంది పాల్గొననున్నారు.

News July 11, 2025

మనుబోలు: ఉదయాన్నే రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

మనుబోలు మండలం పల్లిపాలెం వద్ద శుక్రవారం ఉదయాన్నే జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. TPగూడూరు(M) గంగపట్నంకు చెందిన లక్ష్మయ్య (22) కట్టువపల్లిలో రొయ్యల గుంట వద్ద పని చేస్తున్నాడు. ఉదయాన్నే బైకుపై పల్లిపాలెం వెళ్తూ దారిమధ్యలో గేదె అడ్డు రావడంతో ఢీకొట్టాడు. తలకు గాయాలై తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు విచారణ చేపట్టారు.

News July 11, 2025

కాకాణి గోవర్ధన్ రెడ్డికి మరో కేసులో బెయిల్

image

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి మరో కేసులో ఊరట లభించింది. కృష్ణపట్నం పోర్టు రోడ్ పంట పాలెం వద్ద అక్రమ టోల్ గేట్ పెట్టి వాహనాలకు డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై ముత్తుకూరు పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో రైల్వే కోర్ట్ ఇన్‌ఛార్జ్ న్యాయమూర్తి నిషాద్ నాజ్ షేక్ బెయిల్ మంజూరు చేశారు.

News July 10, 2025

కావలి: గోడ కూలి బేల్దారి మృతి

image

కావలిలో గోడ కూలి బేల్దారి మృతి చెందాడు. డ్రైనేజీ కాలువ నిర్మించేందుకు తవ్వుతుండగా పక్కనేఉన్న గోడ కూలి మృతి చెందాడు. మృతుడు బోగోలు మండలం సాంబశివపురం తాతా వెంకయ్యగా గ్రామస్థులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని బేల్దారి మేస్త్రిలు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

News July 10, 2025

నెల్లూరు: సాంబారులో బల్లి

image

నెల్లూరులోని ఓ ప్రముఖ హోటల్‌ ఆహరంలో బల్లి వచ్చిన ఘటన బుధవారం వెలుగు చూసింది. నగరంలోని ఓ హోటల్‌లో రాత్రి రూ.70 పెట్టి భోజనం కొన్న కస్టమర్ సాంబార్లో బల్లి కనిపించడంతో కంగుతిన్నాడు. ఇదేమిటని హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా వారు నిర్లక్షంగా సమాధానం ఇచ్చినట్లు ఆయన వాపోయాడు. అదే సాంబారును హోటల్ నిర్వాహకులు కస్టమర్లకు పంపిణీ చేశారని ఆరోపించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు శాంపిల్స్ సేకరించారు.

News July 10, 2025

రొట్టెల పండగకు వచ్చిన 2 లక్షల మంది భక్తులు

image

నెల్లూరు బారాషహీద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగ సందర్భంగా నాలుగో రోజైన బుధవారం 2 లక్షల మందికిపైగా భక్తులు దర్గాను దర్శించుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించింది. భక్తుల రద్దీతో స్వర్ణాల చెరువు ఘాట్ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది.

News July 9, 2025

అంతర్జాతీయ స్థాయిలో ముత్తుకూరు యువతి సత్తా

image

అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీ పోటీల్లో ముత్తుకూరు మండలానికి చెందిన వి. భవాని అద్భుత ప్రతిభ కనబరిచారు. రెండు స్వర్ణ పతకాలు సాధించి రాష్ట్రానికే కాదు దేశానికే గర్వకారణంగా గెలిచారు. ఈ మేరకు ఆమెను బుధవారం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభినందించారు. వికలాంగులు ఈ విధంగా ప్రపంచ స్థాయిలో ప్రతిభను చాటుకోవడం హర్షనీయమన్నారు.

News July 9, 2025

నెల్లూరులో స్తంభిస్తున్న ట్రాఫిక్

image

నెల్లూరు రొట్టెల పండుగకు దేశ నలుమూలల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. ఈక్రమంలో వాహనాల రద్దీ అధికమవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోతోంది. ప్రధానంగా వెంకటేశ్వరపురం బ్రిడ్జి, పొదలకూరు రోడ్డు, మినీ బైపాస్, అయ్యప్పగుడి – RTC మెయిన్ రోడ్డు తదితర ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. నెల్లూరు ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు స్పందిస్తూ పునరుద్ధరించే చర్యలు చేపడుతున్నారు.

News July 9, 2025

నెల్లూరు రొట్టెల పండగకు 10 లక్షల మంది భక్తులు హాజరు

image

నెల్లూరు రొట్టెల పండుగకు ఇప్పటివరకు 10 లక్షల మంది భక్తులు హాజరైనట్లు జిల్లా అధికారులు అంచనా వేశారు. మంగళవారం ఒక రోజే 4 లక్షల మందికి పైగా దర్గాను దర్శించుకున్నట్లు తెలిపారు. ఎండ బాగా ఉన్నప్పటికీ భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. దేశ నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.