India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకొన్నట్లు నిజామాబాద్ 4వ టౌన్ SI శ్రీకాంత్ శనివారం తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. వినాయక్ నగర్‌కు చెందిన మల్లెపూల సందీప్ కుమార్(36) వ్యాపారంలో నష్టాలకు గురయ్యాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడంతో శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
అబార్షన్ అయ్యిందని మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన పొతంగల్ మండలం కొడిచర్లలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కొడిచర్ల సుధాకర్‌తో మహాదేవి(28)కి నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమె ఇటీవల గర్భం దాల్చగా పిండం సరిగా లేక అబార్షన్ అయ్యంది. దీంతో మనస్తాపానికి గురై శుక్రవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పెట్టకుండా చూడాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శనివారం ఆయన నిజామాబాద్ కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. నిధులు దుర్వినియోగం అయితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జనాభా ప్రాతిపదికన నిధులు ఖర్చు చేయాలని అధికారులకు సూచించారు.
బాసర జోన్ పరిధిలో 14 మంది ఎస్ఐలు బదిలీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఏడుగురిని వీఆర్‌కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. సిరికొండ SHO రాము, మోపాల్ SHO యాదగిరి, ఎడపల్లి SHO వంశీ కృష్ణ, మెండోరా SHO యాసిర్ అరాఫత్, ఏర్గట్ల SHO రామును నిజామాబాద్ VRకు పంపించారు. బాల్కొండ SHO నరేశ్, మోర్తాడ్ SHO విక్రమ్‌ను ఆదిలాబాద్ VRకు అటాచ్ చేశారు.
నిజామాబాద్ జిల్లాలోని 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలల మరమ్మతులు, మంచినీటి వసతి, విద్యుత్తు రిపేర్లు, ఇతర కనీస వసతుల నిమిత్తం రూ.3.23 కోట్లు మంజూరు అయ్యాయని జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ తెలిపారు. రాష్ట్ర ఇంటర్ బోర్డు కమిషనర్ కృష్ణ ఆదిత్య ఈ నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్రజోపయోగ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేస్తూ, నిర్దేశిత లక్ష్యాల సాధనకు ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, వన మహోత్సవం, సీజనల్ వ్యాధులు, నివేశన స్థలాల క్రమబద్దీకరణ అంశాలపై అధికారులతో సమీక్ష జరిపారు.
బాసర జోన్-2లో పని చేస్తున్న 9 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ASIలుగా పదోన్నతి లభించింది. వీరిని నిజామాబాద్ కమిషనరేట్‌కు అలాట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రియాజుద్దీన్, జక్రయ్య, పరమేశ్వర్, వసంతరావు, అరుణ కుమారి, అనురాధ, రమనేశ్వరి, ముంతాజ్ బేగం, సతీశ్ కుమార్ ASIలుగా పదోన్నతి పొందారు.
డొంకేశ్వర్ మండలం నుంచి మొత్తం 40 మంది విద్యార్థులు IIITకి ఎంపికయ్యారు. ఇందులో డొంకేశ్వర్ ZPHSకు చెందిన 26 మంది విద్యార్థులు ఉండటం విశేషం. 19 మంది అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు ఉన్నారు. తొండాకూర్ ZPHS నుంచి 9, నికాల్పూర్ ZPHS ఐదుగురు, గాదేపల్లి ప్రభుత్వ పాఠశాల నుంచి ఒకరు సెలెక్ట్ అయ్యారు. డొంకేశ్వర్ పాఠశాల హెచ్ఎం సురేశ్, తొండాకూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లింగారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్‌లో నిజామాబాద్ జిల్లాకు చెందిన మహమ్మద్ బాబా మరో బ్రాంజ్ మెడల్ సాధించాడు. అమెరికాలోని అలబామాలో జరుగుతున్న వరల్డ్ పోలీస్ ఆండ్ ఫైర్ గేమ్స్‌లో భాగంగా 35 ఏళ్ల కేటగిరిలో బాబా 110 మీటర్ల హర్డిల్స్‌లో అద్భుత ప్రతిభను ప్రదర్శించాడు. 3వ స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ అందుకున్నాడు. అక్కడి భారతీయ అభిమానులు ఆయనను అభినందించారు.
భీమ్‌గల్ మండలం బెజ్జోరా ఉన్నత పాఠశాలకు చెందిన 14 మంది విద్యార్థులు బాసర ట్రిపుల్ఐటీకి ఎంపికయ్యారు. పదో తరగతి పరీక్షల ఫలితాల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ట్రిపుల్ఐటీకి ఎంపిక చేస్తారు. శుక్రవారం సాయంత్రం విడుదలైన బాసర ఆర్జీయూకేటీ ఫలితాల్లో ఒకేసారి 14 మంది విద్యార్థులు ఎంపిక కావడం సంతోషంగా ఉందని పాఠశాల హెడ్మాస్టర్ హఫీసుద్దీన్ అన్నారు. ఉపాధ్యాయ బృందానికి మండలంలోని పలువురు టీచర్స్ అభినందనలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.