India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తక్కువ సమయంలో అధిక లాభాలు ఇస్తామని ప్రలోభ పెట్టే మోసగాళ్ల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రత్యేకంగా టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజలను టార్గెట్ చేస్తున్నారని చెప్పారు. ఇటీవలి కాలంలో కర్నూలు జిల్లాలో కేసులు నమోదయ్యాయని గుర్తుచేశారు.
విద్య భవిష్యత్తును నిర్ణయిస్తుందని మంత్రి టీజీ భరత్ అన్నారు. గురువారం కర్నూలులోని టౌన్ మోడల్ హైస్కూల్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మంత్రి లోకేశ్ విద్యా వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.
డ్రగ్స్, గంజాయి రహిత సమాజమే మన ముందున్న లక్ష్యమని ఈగల్ ఐజీ రవికృష్ణ అన్నారు. గురువారం కప్పట్రాళ్లలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌కు ఎస్పీ విక్రాంత్ పాటిల్‌తో కలిసి ఆయన హాజరయ్యారు. రవికృష్ణ మాట్లాడుతూ.. పిల్లలు భవిష్యత్తు గురించి ఆలోచించాలన్నారు. అనంతరం గతేడాది 10వ తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు పురస్కారాలను అందజేశారు.
వెల్దుర్తిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమంలో తల్లిదండ్రులకు ఆటల పోటీలను ఉపాధ్యాయులు నిర్వహించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య స్నేహభావాన్ని పెంపొందించే విధంగా జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ విద్యార్థుల తండ్రులతో కలిసి కబడ్డీ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఆయన సూచించారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మనదేశంలో ఎన్నికల ప్రక్రియలో బీఎల్‌వోల పాత్ర కీలకమైందని కర్నూలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, నగరపాలక కమిషనర్ రవీంద్ర బాబు అన్నారు. బుధవారం ఎస్బీఐ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో బీఎల్‌లోలకు శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్నికల సమయంలో బీఎల్‌వోలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీఎల్ఓకు 6 రోజులు శిక్షణ ఉంటుందన్నారు.
కర్నూలు మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్‌కు గవర్నర్ అబ్దుల్ నజీర్ గోల్డ్ మెడల్ బుధవారం విజయవాడలో అందజేశారు. 17వ పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన సమయంలో జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీకి చేసిన సేవలకు గాను ఈ మెడల్ అందజేసి, సన్మానించారు. గవర్నర్‌తో పాటు రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులకు ఎంపీ ధన్యవాదాలు తెలిపారు.
మద్దికేరలోని బురుజుల రోడ్డులో రెండు బైకులు ఢీకొని ఒకరు మృతి చెందారు. మృతుడిని కైరుప్పలకు చెందిన తిరుమల యాదవ్(24)గా పోలీసులు గుర్తించారు. గుంతకల్లు మండలం గుళ్లపాలెంలో భార్యను చూసి సొంతూరుకు వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్ కుమార్ నాయక్ తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్ధల సమీపంలోని 100 గజాల దూరంలో సిగరెట్, పొగాకు సంబంధిత పదార్ధాలు అమ్మడం నిషేధించామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ క్యాంపస్ సేఫ్ జోన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. నిషేధిత వస్తువులను షాప్ నిర్వాహకులు అమ్మితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని యజమానులకు అవగాహన కల్పించారు.
ఆదోనిలోని సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ప్రజా గ్రీవెన్స్‌కు వచ్చిన ఆయా గ్రామాల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వినతులు స్వీకరించారు. డీఎల్డీఓ బాలకృష్ణారెడ్డి, డీఎల్పీఓ తిమ్మక్క, డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణు సూర్య, శ్రీనివాసరాజు పాల్గొన్నారు.
కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఖరీఫ్ (2025-26) పంటలకు నీటి విడుదలకు సంబంధించి జిల్లా నీటి పారుదల సలహా మండలితో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు నీటి కొరత ఉండకుండా చేయాల్సిన అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ బీటీ నాయుడు, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్యేలు పార్థసారథి, బొగ్గుల దస్తగిరి, గౌరు చరిత, జేసీ,సబ్ కలెక్టర్ ఉన్నారు.
Sorry, no posts matched your criteria.