Vizianagaram

News December 13, 2024

భోగాపురం: చిట్టీల కేసులో భార్య, భర్త అరెస్ట్

image

చీటీలు, స్కీములు నిర్వహించి సుమారు రూ.2 కోట్లు వరకు మోసం చేసిన భీమిలి మండలం వలందపేటకు చెందిన భార్యాభర్తలు సరగడపార్వతీ, లక్ష్మణరెడ్డిలను అరెస్టు చేసినట్లు సీఐ ఎన్వీ ప్రభాకర్ తెలిపారు. భోగాపురం మండలం చెరుకుపల్లిలో చీటీలు, రకరకాల స్కీములు నిర్వహించి గ్రామస్థుల నుంచి సుమారు రూ.2 కోట్లు చీటింగ్ చేసినట్లు ఆ గ్రామానికి చెందిన మజ్జి త్రినాథమ్మ ఫిర్యాదుతో దర్యాప్తు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు.

News December 13, 2024

మక్కువ: విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

image

మక్కువ మండలంలోని శంబర రహదారి సమీపంలో ఇటుక బట్టి వద్ద పని చేస్తున్న అంజిబాబు విద్యుత్ షాక్‌కు గురై గురువారం మృతి చెందాడు. యానాదుల వీధికి చెందిన అంజిబాబు గత కొన్ని ఏళ్లుగా ఇటుక బట్టి వద్ద పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రమాదవశాత్తు ఐరన్ పైపులను తాకడంతో వెంటనే షాక్ గురయ్యాడు. స్థానికులు ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

News December 11, 2024

గూగుల్‌తో ఎంవోయూ చేసుకున్నాం: సీఎం చంద్రబాబు

image

అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఈ సమావేశానికి ముందు విశాఖలో గూగుల్‌ ఏర్పాటుకు ఎంవోయూ చేసుకున్నామన్నారు. ఇటీవల విశాఖలో గూగుల్ ప్రతినిధులు పర్యటించి సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. గూగుల్ విశాఖకు వచ్చాక గేమ్ ఛేంజర్ అవుతుందన్నారు. డేటా సెంటర్, ఏఐ, మెషీన్ లెర్నింగ్, డీప్‌టెక్, సీకేబుల్ వచ్చాక ప్రపంచానికే విశాఖ సర్వీస్ సెంటర్ అవుతుందని పేర్కొన్నారు.

News December 11, 2024

గజపతినగరం: చికిత్స పొందుతూ మహిళ మృతి

image

గజపతినగరం మండలం పురిటిపెంట రైల్వే గేట్ సమీపంలో నవంబర్ 29న మరుపల్లికి చెందిన స్నేహితులు సీర పైడిరాజు, చవుకు రామలక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పైడిరాజు 30వ తేదీన చనిపోగా.. రామలక్ష్మి చికిత్స పొందుతూ సోమవారం రాత్రి చనిపోయినట్లు గజపతినగరం ఎస్ఐ కే.లక్ష్మణరావు బుధవారం తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

News December 11, 2024

VZM: ఆరు నెలల ప్రగతిపై మీ కామెంట్?

image

నేడు, రేపు అమరావతిలో సీఎం చంద్రబాబుతో జరిగే సదస్సులో పార్వతీపురం, విజయనగరం కలెక్టర్లు అంబేడ్కర్, శ్యాంప్రసాద్ పాల్గొంటారు. కూటమి ప్రభుత్వ ఆరు నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఈ సదస్సులో చర్చించనున్నట్లు సమాచారం. మరి ఈ ఆరు నెలల వ్యవధిలో పార్వతీపురం, విజయనగరం జిల్లాల్లోని మీ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై మీ కామెంట్.

News December 11, 2024

VZM: కొత్తగా వ్యవసాయ మార్కెట్ కమిటీల ఏర్పాటు..!

image

వ్యవసాయ మార్కెట్ కమిటీల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో పార్వతీపురం, సాలూరు, కురుపాం, విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి, పూసపాటిరేగ, కొత్తవసల, మెరకముడిదాం మార్కెట్లు ఉన్నాయి. 20 మందితో కమిటీ ఏర్పాటు చేస్తారు. వీరిలో MLA, 12 మంది రైతులు, ముగ్గురు వ్యాపారులు, కోపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏడీ, సర్పంచ్, వ్యవసాయశాఖ సహాయ సంచాలకుడు, గ్రామ సర్పంచ్ ఉంటారు.

News December 11, 2024

విజయవాడకు వెళ్లిన విజయనగరం, పార్వతీపురం జిల్లాల కలెక్టర్లు

image

విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల కలెక్టర్లు డా.అంబేడ్కర్, ఏ.శ్యాం ప్రసాద్ విజయవాడకు వెళ్లారు. నేడు, రేపు అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న కలెక్టర్ల సదస్సులో పాల్గొంటారు. కూటమి ప్రభుత్వ ఆరు నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. అలాగే స్వర్ణాంధ్ర విజన్‌-2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకొచ్చిన పాలసీలపై సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారు.

News December 11, 2024

విజయనగరం పట్టణంలో ఆక్రమణలు తొలగింపు 

image

విజయనగరంలోని సాలిపేట రహదారిలో ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక ఆక్రమణలను మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య ఆదేశాలతో పట్టణ ప్రణాళిక సిబ్బంది మంగళవారం తొలగించారు. ఎన్సీఎస్ థియేటర్ రోడ్‌లో అనధికార ప్రకటన బోర్డులను తొలగించారు. సాలిపేట రోడ్‌లో అనధికారికంగా నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రణాళిక విభాగం అధికారులు నిర్మాణ దశలోనే వాటిని అడ్డుకున్నారు. ఆక్రమణలను ఉపేక్షించేది లేదని కమిషనర్ స్పష్టం చేశారు.

News December 10, 2024

విజయనగరంలో నటి సూర్యకాంతం కుటుంబ సభ్యులు

image

అలనాటి ప్రముఖ సినీ నటి సూర్యకాంతం కుటుంబ సభ్యులు విజయనగరంలో మంగళవారం పర్యటించారు. సూర్యకాంతం కుమారుడు అనంత పద్మనాభ మూర్తి, కోడలు ఈశ్వరరాణి, తదితరులు గురజాడ అప్పారావు మ్యూజియాన్ని సందర్శించారు. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గురజాడ అప్పారావు ముని మనవడు గురజాడ ప్రసాద్ పాల్గొన్నారు.

News December 10, 2024

VZM: ‘ఆ కేసుల్లో రాజీ కుదర్చండి’

image

డిసెంబర్ 14న జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌లో ఎ అదాలత్‌లో పలు కేసుల్లో ఇరు వర్గాలకు రాజీ చేయాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి రాజేశ్ కుమార్ సూచించారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల న్యాయమూర్తులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజీ పడదగిన క్రిమినల్, మోటార్ ప్రమాద బీమా, బ్యాంకు, చెక్కు బౌన్స్, తదితర కేసులను ఇరు పార్టీల అనుమతితో రాజీ మార్గంలో శాశ్వత పరిష్కారం చేయాలన్నారు.