India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రభుత్వ శాఖల అధికారులు, మీడియా సంస్థల ప్రతినిధులతో సమన్వయంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. వరంగల్ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారిగా నియమితులైన బి.ప్రేమలత హనుమకొండ నక్కలగుట్టలో కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్క బహూకరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సమాచార శాఖ ద్వారా మీడియాకు చేరవేయడంలో అనుసంధాన కర్తగా వ్యవహరిస్తుందని కలెక్టర్ అన్నారు.

రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం కలెక్టరేట్ వద్ద భోజన విరామ సమయంలో నిరసన చేపట్టనున్నట్లు వరంగల్ జిల్లా ఛైర్మన్ గజ్జల రామ్ కిషన్ తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల సాధన కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నిరసనకు అనుమతి కోరుతూ అదనపు కలెక్టర్ సంధ్యారాణికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ ఫణి కుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గీసుగొండ మండలం కోనాయిమాకులం రైతు వేదికలో మండల స్థాయి సమావేశం జరిగింది. కలెక్టర్ డా. సత్య శారద ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం నిర్దేశించిన పది ముఖ్య అంశాలపై అధికారులు, సర్పంచులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గ్రామాభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని, ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లో ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ డా.సత్య శారద ప్రజల నుంచి 166 వినతిపత్రాలను స్వీకరించారు. ఇందులో రెవెన్యూ శాఖకు 74, జీడబ్ల్యూఎంసీకి 25, ఇతర శాఖలకు 67 దరఖాస్తులు వచ్చాయి. సంబంధిత అధికారులతో సమక్షంలోనే చర్చించి సమస్యలను తెలుసుకున్న కలెక్టర్, వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. జూమ్ ద్వారా తహశీల్దార్లు, ఎంపీడీవోలతో సమన్వయం చేసి చర్యలు చేపట్టారు.

నర్సంపేటలోని శాంతినగర్‌లో నివాసం ఉంటున్న ఉప్పరపల్లికి చెందిన చింతకింది శివకృష్ణ, మౌనిక దంపతులకు ముగ్గురు సంతానం. కూతురు అక్షర 2020 జూన్ 3వ తేదీన జన్మించింది. రెండవ సంతానం అర్జున్ 2022, జూన్ 3వ తేదీన, మూడవ సంతానం ఆదిత్య 2024 జూన్ 3వ తేదీన జన్మించాడు. ముగ్గురూ ఒకే నెల, ఒకే తేదీన రెండేళ్ల వ్యవధిలో జన్మించడంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు.

నెక్కొండ టీజీఆర్‌జేసీకి చెందిన తేజస్వి ఇంటర్ మొదటి సంవత్సరం MPCలో 470కి 467 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచింది. కరీంనగర్ జిల్లా ఎల్లంతకుంట మండలం మల్యాల గ్రామానికి చెందిన ఆమె తండ్రి అశోక్ కుమార్, తల్లి మమత కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తేజస్వి కష్టపడి ఈ ఫలితాన్ని సాధించింది. భవిష్యత్తులో ఐపీఎస్ అధికారి కావాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తానని తెలిపింది.

ఇంటర్ 2nd ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. వరంగల్(D)లో రెగ్యులర్ విద్యార్థులు 4678 మంది పరీక్షలు రాయగా 2844 మంది పాసై 60.80 శాతంతో స్టేట్‌లో 34వ స్థానంలో ఉంది. ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 737 మందికి 545 మంది పాసై 73.95 శాతంతో 17వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 679 మందికి 193 మంది పాసై 28.42%తో 29వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 70 మందికి 40మంది పాసై 57.14%తో 9వ స్థానం వచ్చింది.

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదలయ్యాయి. వరంగల్ జిల్లాలో రెగ్యులర్ ఫస్టియర్ విద్యార్థులు 5211 మంది పరీక్ష రాయగా 2752 మంది పాసై 52.81 శాతంతో స్టేట్‌లో 30వ ర్యాంక్‌లో నిలిచింది. ఇక ఒకేషన్‌లో 793 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 428 మంది విద్యార్థులు పాసై 53.97 శాతంతో స్టేట్‌లో 28వ స్థానంలో నిలిచింది.

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదలయ్యాయి. వరంగల్ జిల్లాలో రెగ్యులర్ ఫస్టియర్ విద్యార్థులు 5211 మంది పరీక్ష రాయగా 2752 మంది పాసై 52.81 శాతంతో స్టేట్‌లో 30వ ర్యాంక్‌లో నిలిచింది. ఇక ఒకేషన్‌లో 793 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 428 మంది విద్యార్థులు పాసై 53.97 శాతంతో స్టేట్‌లో 28వ స్థానంలో నిలిచింది.

జిల్లాలో మొత్తం 12,166 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల సమయంలో కొందరు విద్యార్థులు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉందని, మార్కులు తక్కువ వచ్చినా, ఫెయిల్ అయినా అది జీవితానికి ముగింపు కాదని, ఆత్మహత్యలు వంటి నిర్ణయాలకు దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు మానసికంగా అండగా నిలవాలని, అవసరమైతే కౌన్సెలింగ్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఫలితాలను Way2Newsలో వేగంగా చూడవచ్చు.
Sorry, no posts matched your criteria.