India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తిరుమలలో దువ్వాడ శ్రీనివాస్, మాధురిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనిపై తిరుమల DSP విజయశేఖర్ స్పందించారు. ‘తిరుమల మాఢ వీధుల్లో వ్యక్తిగత విషయాలు మాట్లాడటం నిబంధనలకు విరుద్ధం. ఈవిషయమై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ వాళ్లు మాకు ఫిర్యాదు చేయడంతో BNS 293, 300 సెక్షన్ల కేసు నమోదు చేశాం. తిరుమలలో వ్యక్తిగత విషయాలు మాట్లాడకపోవడం మంచిది’ అని డీఎస్పీ సూచించారు.
మద్యం దరఖాస్తుల స్వీకరణ గడువు నేటితో ముగియనుంది. నిన్న రాత్రికి జిల్లావ్యాప్తంగా 3,427 దరఖాస్తులు అందినట్లు ప్రొహిబిషన్&ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంతరెడ్డి తెలిపారు. శ్రీకాకుళం 825-32 షాపులు, ఆమదాలవలస 268-13, రణస్థలం 502-15, పొందూరు281-10, నరసన్నపేటలో 193-12, కొత్తూరు 178-7, పాతపట్నం 177-8, టెక్కలి 184-11, కోటబొమ్మాళి 224-15, పలాస 154-15, సోంపేట 233-12,ఇచ్చాపురం 208-8 దరఖాస్తులు వచ్చాయన్నారు.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన సన్నిహితురాలు దివ్వెల మాధురిపై గురువారం తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల తిరుమల క్షేత్రాన్ని దర్శించిన వీరు తిరుమల మాడ వీధుల్లో అభ్యంతరకరంగా వ్యవహరించారన్న ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీటీడీ అధికారులు ఫిర్యాదు మేరకు దువ్వాడ శ్రీనివాస్, మాధురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఆమదాలవలస మండలం కొర్లకోట గ్రామానికి చెందిన పేడాడ హిమ శ్రీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయ పరీక్షలలో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్ట్ ఫలితాలకు సంబంధించి రాష్ట్రంలో 9వ ర్యాంక్ సాధించింది. ఈమె తండ్రి ప్రభాకరరావు స్కూల్ అసిస్టెంట్‌గా సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం ఉన్నత పాఠశాలలో పని చేస్తున్నారు. తల్లి గృహిణి. హేమ శ్రీ ఎంపిక పట్ల తల్లిదండ్రులు గ్రామస్థులు అభినందనలు తెలిపాలి.
భూ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తహసీల్దార్లకు ఆదేశించారు. తహసీల్దార్లుతో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పిజిఆర్ఎస్ అర్జీలపై గురువారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న ఎలినేషన్స్ పైన మండలాల వారీగా ఆయన సమీక్షించారు. ఎలినేషన్స్ ప్రతిపాదనలు తక్షణమే పంపాలని ఆదేశించారు. కోర్టు కేసులు ఎక్కడెక్కడ పెండింగ్‌లో ఉన్నది తెలుసుకోవాలని చెప్పారు.
దసరా రద్దీ దృష్ట్యా విజయవాడ – శ్రీకాకుళం రోడ్ మధ్య దువ్వాడ మీదుగా కొన్ని రోజుల పాటు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైలు నంబర్ 07215 ఈనెల 10, 11,12,14,15,16,17 తేదీల్లో విజయవాడలో రాత్రి 8 గంటలకు బయలుదేరి శ్రీకాకుళం రోడ్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో రైలునంబర్ 07216 ఈనెల 10,11,12,13,15,16,17,18 తేదీల్లో శ్రీకాకుళం రోడ్డులో ఉదయం 6.30కి బయలుదేరి విజయవాడ చేరుతుంది.
విజయనగరం పైడితల్లి ఉత్సవాల నిర్వహణపై భక్తుల సలహాలు సూచనలు కోసం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం డయల్ యువర్ ఎంపీ కార్యక్రమం చేపట్టారు. అనంతరం భక్తులు తెలిపిన అభిప్రాయాలను జిల్లా కలెక్టర్ అంబేడ్కర్, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌తో చర్చించారు. అమ్మవారి ఉత్సవాలకు ఈ ఏడాది ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ 5వ సెమిస్టర్ పరీక్షల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఉదయ్ భాస్కర్ షెడ్యూల్ విడుదల చేశారు. విద్యార్థులు ఈనెల 20వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని. ప్రాక్టికల్స్ ఈ నెల 29 నుంచి నవంబర్ 2 వరకు జరుగుతాయన్నారు. పరీక్షలు నవంబర్ మొదటి వారం నుంచి ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు.
కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం ధర్మవరం వద్ద నిర్మిస్తున్న ఆర్ అండ్ ఆర్ కాలనీలో అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ ఆహ్మద్‌తో కలిసి సంబంధిత అధికారులతో బుధవారం ఆయన తన కార్యాలయంలో సమావేశమయ్యారు. అప్రోచ్ రోడ్డు పెండింగ్ పనులపై, నిర్వాసితులకు చెల్లించాల్సిన పెండింగ్ నష్ట పరిహారాలపై చర్చించారు.
జిల్లాలో మొత్తం 6 రీచ్ల వద్ద ఇసుకను మనుషులతో తవ్వకాలు చేసి నిల్వ కేంద్రానికి తరలించి, వినియోగదారుల వాహనాలకు లోడ్ చేసేందుకు గాను టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. జిల్లా భూగర్భ గనులశాఖ కార్యాలయం (కిమ్స్ ఆసుపత్రి వెనుక)లో ఈ నెల 11న ఉదయం 11 గంటల్లోగా సీల్డు టెండర్ల బిడ్ డాక్యుమెంట్లను స్వీకరించనున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.