Nizamabad

News April 17, 2026

నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల నిరసన

image

TGE-JAC పిలుపు మేరకు ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ప్రభుత్వ మొండి వైఖరి వీడి PRC, పెండింగ్ బకాయిలు, హెల్త్ కార్డుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో STU జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి ధర్మేందర్, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

News April 17, 2026

NZB: కొనుగోళ్ల పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించి వరి ధాన్యం, పసుపు, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను పర్యవేక్షించేందుకు వీలుగా జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ శుక్రవారం ప్రారంభించారు. ధాన్యం, మొక్కజొన్న, పసుపు విక్రయాలకు సంబంధించి 08462-220183 నంబర్‌కు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటారన్నారు.

News April 17, 2026

తెలంగాణ వర్సిటీ ఈసీ సభ్యురాలిగా అల్లే లావణ్య

image

తెలంగాణ విశ్వవిద్యాలయ కార్యనిర్వాహక మండలి సభ్యురాలిగా సాలూరకు చెందిన అల్లే లావణ్య నియమితులయ్యారు. విద్య, వ్యవసాయం, పరిశ్రమలు, సామాజిక సేవా రంగాల్లో ఆమెకున్న అనుభవం వర్సిటీ అభివృద్ధికి తోడ్పడనుంది. విద్యా ప్రమాణాల పెంపుదల, సమాజ సేవ పట్ల ఆమెకున్న నిబద్ధతను గుర్తించి ప్రభుత్వం ఈ గౌరవ బాధ్యతను అప్పగించింది.

నిప్పుల కొలిమిలా నిజామాబాద్ జిల్లా

image

నిజామాబాద్ జిల్లాలో భానుడు భగభగలాడుతున్నాడు. గడిచిన 24 గంటల్లో జిల్లాలో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. అత్యధికంగా ఎడపల్లి, ఆర్మూర్ మండలంలోని పెర్కిట్‌లో 44.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ రూరల్, డిచ్‌పల్లి, మాక్లూర్ మండలాల్లో కూడా 44 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదై ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. జిల్లాలో అంతటా 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదుకావడం ఆందోళనకరం.

News April 17, 2026

NZB: 500 ఏళ్ల పురాతన క్షేత్రం.. నీలకంఠేశ్వర ఆలయం

image

నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ ఆలయం సుమారు 500 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన క్షేత్రం. ఉత్తర భారత శిల్పకళా రీతిలో ఉన్న ఈ కోవెల శివభక్తులకు పరమ పవిత్రం. ఇక్కడి శివలింగం, ఆలయ ప్రాకారం భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతాయి. శతాబ్దాలు గడిచినా నాటి నిర్మాణ చాతుర్యం చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. ఈ పురాతన కట్టడాలను భావితరాలకు అందించాలి.
#నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవం

News April 17, 2026

ఇందూరు కోట.. ఖిల్లా రఘునాథ ఆలయం

image

నిజామాబాద్ నగర నడిబొడ్డున ఎత్తైన గుట్టపై ఉన్న ఈ కోటను రాష్ట్రకూటులు నిర్మించగా, అనంతరం ఛత్రపతి శివాజీ దీనిని అభివృద్ధి చేశారు. ఇక్కడి రామమందిరం ఆధ్యాత్మికతకు నిలయం. కోటలోని రాతి కట్టడాలు, బురుజులు నాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి సాక్ష్యాలు. పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న ఈ ఆలయం నుండి నగరం మొత్తాన్ని చూడవచ్చు. ఈ చారిత్రక సంపదను కాపాడుకోవడం మన బాధ్యత.
#నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవం

News April 16, 2026

నిజామాబాద్: కీటక జనిత వ్యాధులపై నిఘా పెంచాలి – డీఎంహెచ్ఓ

image

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మలేరియా, డెంగ్యూ వంటి కీటక జనిత వ్యాధుల నియంత్రణపై సమీక్ష నిర్వహించారు. డీఎంహెచ్ఓ డా.బి.రాజశ్రీ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో RDT పరీక్షలు పెంచాలని, వివరాలను IHIP పోర్టల్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా వ్యాధుల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.

తెలంగాణ వర్సిటీ పాలక మండలి సభ్యుడిగా దండు స్వామి

image

డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ గ్రామానికి చెందిన డాక్టర్ దండు స్వామిని తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సభ్యుడిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆయన ప్రస్తుతం గిరిరాజ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, ఇంగ్లీష్ విభాగం హెచ్‌ఓడీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దండు స్వామి నియామకం పట్ల బర్దిపూర్ గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.