India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బోధన్ డివిజన్‌లో MLHPలు, ఏఎన్ఎంలకు HMIS సాఫ్ట్‌వేర్‌పై శిక్షణ నిర్వహించారు. డీఎంహెచ్ఓ డా.బి.రాజశ్రీ మాట్లాడుతూ.. వైద్య సేవల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజలకు వడదెబ్బపై అవగాహన కల్పించాలని, నీరు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలు తీసుకునేలా ప్రోత్సహించాలని సిబ్బందికి సూచించారు.

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారం, సైబర్ నేరాల కట్టడి, రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ‘అరెవ్ అలైవ్’ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో కచ్చితంగా అమలు చేయాలని సీపీ స్పష్టం చేశారు. అదనపు డీసీపీ జి.బస్వా రెడ్డి, ఏసీపీలు పాల్గొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పలు మీ సేవ కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ (ACB) కొరడా ఝుళిపించింది. బుధవారం నిజామాబాద్‌తో పాటు రాష్ట్రంలోని 13 మీ సేవా కేంద్రాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లేదా మీ సేవ నిర్వాహకులు లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు.

తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా మాట్లాడిన తేజస్వీ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ ఎంపీలు స్పందించాలని కవిత డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ సమాజానికి జరిగిన అవమానమని అన్నారు. ఈ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా అంటూ వారిని ప్రశ్నించారు. వెంటనే ఈ వ్యాఖ్యలను ఖండించి తేజస్వీ సూర్యతో క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ ప్రాంత ఎంపీలుగా కొనసాగే అర్హత మీకు లేదంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

నిజామాబాద్ నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో ఓ అద్దె ఇంట్లో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నరనే సమాచారంతో దాడి చేసినట్లు రూరల్ SHO శ్రీనివాస్ తెలిపారు. ఈ దాడిలో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న న్యాలం శ్రీనివాస్, పాపి భూదేవితో పాటు ఒక విటుడిని, ఓ మహిళను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు SHO వివరించారు.

నిజామాబాద్ జిల్లాలో ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 27 వరకు నిర్వహించనున్న తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు CP సాయి చైతన్య తెలిపారు. మొత్తం 27 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు పరీక్షలు కొనసాగనున్నట్లు సీపీ వెల్లడించారు.

పసుపు రైతుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ, వారికి మేలు చేకూర్చడమే ధ్యేయంగా జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లభించాలనే ఉద్దేశంతో స్థానిక మార్కెట్ యార్డులో పసుపు అమ్మకాల్లో బహిరంగ వేలం విధానాన్ని అమలు చేయడం జరిగిందన్నారు. పసుపు క్వింటాకు సగటున రూ.16,000 ధర లభిస్తోందని తెలిపారు. రైతులు ఎలాంటి అపోహలకు గురి కాకూడదని సూచించారు.

కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే పసుపు రైతులకు ఇబ్బందులు అని కాంగ్రెస్ NZB జిల్లా అధ్యక్షుడు నగేశ్ రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పసుపు కొనుగోళ్ల కోసం కొత్తగా తెచ్చిన 0.2 సాఫ్ట్‌వేర్‌లో NZB మార్కెట్‌ను చేర్చకపోవడం బీజేపీ కుట్రని, దీని వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Sorry, no posts matched your criteria.