India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సర్వేపల్లి నియోజకవర్గం చెముడు గుంటలోని శిరిడిస్ కళ్యాణ మండపంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఎస్టీల కోసం శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. వెంకటచలం మండలంలోని తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదికలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తొలుత ఆయన అర్జీదారుల నుంచి 550 పైగా అర్జీలు స్వీకరించారు.
లైంగికంగా వేధిస్తున్నాడని పంచాయతీ సెక్రటరీపై ఓ గిరిజన మహిళ SPకి ఫిర్యాదు చేసింది. బాధితురాలు వివరాల ప్రకారం.. రాపూరు పంచాయతీలోని కోడూరుపాడుకు చెందిన ఓ గిరిజన మహిళ తన తండ్రి చనిపోవడంతో డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలని పంచాయతీ సెక్రటరీ చెంచయ్యను కోరింది. ఆయితే ఆయన తనతో వీడియో కాల్ మాట్లాడాలని, తన కోరిక తీర్చితే డెత్ సర్టిఫికెట్ 5 నిమిషాల్లో ఇస్తానని వేధించాడని చెప్పింది. సోమవారం ఎస్పీకి ఫిర్యాదు చేసింది.
వాకాడు మండలం బాలిరెడ్డిపాలెంలో విషాదం చోటు చేసుకుంది. బాలిరెడ్డిపాళెం గ్రామానికి చెందిన చరణ్(14)ను పాము కాటేసింది. కుటుంబ సభ్యులు బాలుడిని బాలిరెడ్డిపాళెం ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రి మూసేసి ఉంది. గూడూరుకి తరలించేలోపు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సకాలంలో వైద్యం అందుంటే బతికుండేవాడని కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
బాలాయపల్లి మండలంలో మరో అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. మండంలోని ఓ గ్రామంలో ఐదేళ్ల చిన్నారిపై 9వ తరగతి చదువుతున్న బాలుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. చిన్నారి గట్టిగా కేకలు వేసింది. దీంతో అక్కడికి చేరకున్న చిన్నారి బంధువులను చూసి నిందితుడు పరారయ్యాడు. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరులోని వేమారెడ్డి నగర్‌లో చోటుచేసుకుంది. రాగాల యాచేంద్ర, తేజస్విని(20)కి రెండేళ్ల క్రితం వివాహం అయింది. సంతానం లేకపోవడంతో యాచేంద్ర ఆమెను నిత్యం వేధింపులకు గురి చేశాడు. దీంతో వేధింపులకు తట్టుకోలేక ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నెల్లూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం పొందాలని కమిషనర్ సూర్య తేజ ఆకాంక్షించారు. నేడు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రజలు నేరుగా తమ సమస్యలను అర్జీల రూపంలో తమకు చెప్పొచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పట్ల అధికారి వ్యవహరించిన తీరుపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ZP సమావేశంలో MPను సగౌరవంగా ఆహ్వానించకపోవడంతో అలిగి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అనంతరం వేమిరెడ్డికి అందరి తరఫున క్షమాపణలు చెబుతున్నట్లు మంత్రి తెలిపారు.
బాలాయపల్లి మండలం, జయంపు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శివారెడ్డి జనార్దన్ రెడ్డి ఇంటిపై అర్ధరాత్రి అదే గ్రామానికి చెందిన కొంతమంది దాడికి పాల్పడ్డారు. శివారెడ్డి జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులను అమానుషంగా కొట్టి గాయపరిచారు. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వాకాడు మండల పరిధిలోని శ్రీనివాసపురం గిరిజన కాలనీలో కొడుకు తండ్రిని కొట్టి చంపిన కేసులో నిందితుడు తుపాకుల రమేశ్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచి రిమాండ్‌కు తరలించారు. వాకాడు సీఐ హుస్సేన్ బాషా మాట్లాడుతూ.. తుపాకుల రమేశ్ మద్యానికి బానిసై తన కుటుంబ సభ్యులతో గ్రామస్థులతో నిత్యం గొడవలు పడుతూ పలువురిని గాయపరచిన సంఘటనలు ఉన్నాయని తెలిపారు.
గత నెల మలేషియాలో జరిగిన మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడా పోటీల్లో ప్రతిభ చూపి మనదేశ కీర్తి ప్రతిష్ఠలు చాటి చెప్పిన నాయుడుపేటకు చెందిన క్రీడాకారుడు గుంటూరు వెంకట్రావు దంపతులను శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో హై జంప్ లో గోల్డ్ మెడల్, త్రిబుల్ జంప్ లో సిల్వర్ మెడల్స్ సాధించి మన దేశ జాతీయపతాకాన్ని వెంకట్రావు రెపరెపలాడించారు.
Sorry, no posts matched your criteria.