RangaReddy

News September 15, 2024

HYD: 16న నాగపూర్-సికింద్రాబాద్‌ ‘వందే భారత్’ ప్రారంభం

image

నాగపూర్ నుంచి సికింద్రాబాద్(SEC) మార్గంలో ఈ నెల 16న వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. నాగపూర్ నుంచి ఉ.5 గంటలకు బయలుదేరి మ.12:15కు SEC చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో SEC నుంచి మ.1 గంటకు బయలుదేరి రా.8:20కు నాగపూర్ చేరుకుంటుంది.కాజీపేట, రామగుండం, బల్లార్ష, చంద్రాపూర్, సేవగ్రాంలో హాల్టింగ్ ఉంటుంది.

News September 15, 2024

గణపతి నిమజ్జనానికి A-Z సర్వం సిద్ధం: ఆమ్రపాలి

image

HYD సరూర్‌నగర్‌ చెరువు, జీడిమెట్ల ఫాక్స్‌ సాగర్‌, బహదూర్‌పుర మీరాలం, కాప్రా ఊర చెరువులో గణేశ్ నిమజ్జనానికి A-Z సిద్ధం చేసినట్లు GHMC కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. 172 రోడ్ల మరమ్మతులు, 36 ట్రాన్స్‌పోర్ట్‌, 140 స్టాటిక్‌ క్రేన్‌లు, 295 మొబైల్‌ క్రేన్స్‌, 160 గణేశ్ యాక్షన్‌ టీమ్స్‌, 102 మినీ టిప్పర్లు, 125 జేసీబీలు, 308 మొబైల్‌ టాయిలెట్స్‌, 52,270 తాత్కాలిక స్ట్రీట్‌ లైట్స్‌ సిద్ధం చేసినట్లు చెప్పారు.

News September 15, 2024

HYD: శంషాబాద్‌లో వరల్డ్ ట్రేడ్ సెంటర్

image

HYD శివారు శంషాబాద్ ప్రాంతంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. RGIA సమీపాన దాదాపుగా 10 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో వివిధ దశల్లో దీనిని నిర్మించనున్నారు. ఇప్పటికే ఓ ఆఫీస్ టవర్ నిర్మాణం ప్రారంభం కాగా.. 2025-26 నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా ఇంజినీరింగ్ బృందం కసరత్తు చేస్తోంది. మరోవైపు నగరంలో AI సిటీ సైతం నిర్మిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

News September 15, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✓NIMS ఆస్పత్రిలో SEP 22 నుంచి 28 వరకు ఉచిత గుండె శస్త్ర చికిత్సలు
✓ఖైరతాబాద్ గణేష్ వద్దకు తరలిన జనం
✓బాలాపూర్ గణనాథుని దర్శించుకున్న రాష్ట్ర DGP
✓SEP 17న గ్రేటర్ HYD పరిధిలో అనేక చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
✓బోడుప్పల్: వక్ఫ్ బాధితులను కలిసిన ఎంపీ DK అరుణ
✓KPHB: గణపతి నిమజ్జనంలో ముస్లిం సోదరుల డాన్స్.

News September 14, 2024

HYD నగరంలో DGP పర్యటన

image

HYD నగర వ్యాప్తంగా డీజీపీ జితేందర్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. గణపతి నిమజ్జనానికి చేపడుతున్న ఏర్పాట్లు,బందోబస్తు గూర్చి పరిశీలించారు.చార్మినార్, బాలాపూర్, సెక్రటేరియట్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో సిపిలతో కలిసి పరిస్థితులు పరిశీలించారు. నిమజ్జనం, ఊరేగింపు సాఫీగా జరిగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. పర్యటనలో సీపీలు సుధీర్ బాబు, సివి ఆనంద్, కలెక్టర్ అనుదీప్, కమిషనర్ ఆమ్రపాలి పాల్గొన్నారు.

News September 14, 2024

త్వరలో ఉద్యోగుల కోసం ట్రాన్స్‌ఫర్ పాలసీ: బలరాం

image

రాష్ట్ర సింగరేణి ఉద్యోగులకు CMD బలరాం శుభవార్త చెప్పారు. HYD లక్డీకపూల్ వద్ద ఉన్న సింగరేణి భవన్లో మాట్లాడుతూ.. త్వరలో ఉద్యోగుల కోసం ట్రాన్స్‌ఫర్ పాలసీ తెస్తామన్నారు.బదిలీ, విజ్ఞప్తులను ఆన్ లైన్లో స్వీకరించేందుకు యాప్ రూపొందిస్తామన్నారు. రెండు నెలల్లో సింగరేణిలో ఈ-ఆఫీస్ ప్రారంభిస్తామని, గ‌నుల్లోని కార్య‌క‌లాపాల‌ను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తామని వెల్లడించారు.

News September 14, 2024

HYD: రెచ్చగొట్టే వారిని అణచివేయండి: మంత్రి

image

ఐక్యతకు హైదరాబాద్ ప్రతీకగా నిలిచిందని, అలజడలు సృష్టిస్తే కఠినంగా వ్యవహరించాలని HYD ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా వర్గ విభేదాలు సృష్టిస్తూ సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టి, అపోహలు సృష్టించే వారిని ఉక్కుపాదంతో అణచివేయాలన్నారు.

News September 14, 2024

HYD: 10 నిమిషాలతో సగం రోగాలు దూరం: GHMC

image

గ్రేటర్ HYD ప్రజలకు జీహెచ్ఎంసీ కీలక సూచన చేసింది. రోజూ 10-15 నిమిషాల పాటు వేడి చేసి, చల్లార్చి గురువెచ్చని నీటిని తాగితే సగం రోగాలు దూరమవుతాయని తెలిపింది. నీటి కలుషితంతో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని, బ్రష్ చేసేటప్పుడు, వంట వండేటప్పుడు, కూరగాయలు, పండ్లు కడిగేటప్పుడు వేడిచేసిన నీటితో కడగటం శ్రేయస్కరమని పేర్కొన్నారు. RR, MDCL, VKB ప్రజలు సైతం పాటించాలని డాక్టర్లు సూచించారు.

News September 14, 2024

గవర్నర్ వద్దకు వెళ్లిన సికింద్రాబాద్ ADRM

image

గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ వద్దకు సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే కమర్షియల్ మేనేజర్, అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ గోపాల్ వెళ్లారు. గవర్నర్ పిలుపు మేరకు వెళ్లిన అధికారి, రైల్వే అభివృద్ధి, ఇతర అంశాల గురించి విస్తృతంగా చర్చలు జరిపినట్లు తెలిపారు. రైల్వే సేఫ్టీపై తగు చర్యలు తీసుకోవాలని గవర్నర్ వారికి సూచించారు.

News September 14, 2024

నిమ్స్‌లో ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు

image

నిమ్స్‌లో ఈ నెల 22 నుంచి 28 వరకు యూకే వైద్యుల బృందం ఉచిత గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నట్లు నిమ్స్ సంచాలకుడు బీరప్ప శనివారం తెలిపారు. గుండెకు రంధ్రం ఇతర సమస్యలతో బాధపడుతున్న వాళ్లకు వైద్య సేవలు అందించనున్నారు. వివరాలకు నిమ్స్‌లోని కార్డియో వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.