RangaReddy

News September 14, 2024

రంగారెడ్డి: ‘వారిని రాజకీయాలకు అనర్హులుగా ప్రకటించాలి’

image

గత రెండు,మూడు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై నాయకులు వాడుతున్న పదజాలంపై రంగారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా అధికార ప్రతినిధి శివారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎలక్షన్ కమిషనర్, కోర్టులు ఇలాంటి మాటలు మాట్లాడిన ప్రజాప్రతినిధుల సభ్యత్వాన్ని రద్దుచేసి, మాటలను బట్టి 10 నుంచి 20 ఏళ్లు రాజకీయానికు అనర్హులుగా ప్రకటించాలని కోరారు.

News September 14, 2024

HYD: భార్య సహకారంతో అత్యాచారం.. ఆపై హత్య

image

భార్య సహకారంతో భర్త అత్యాచారం చేసి క్రూరంగా హింసించి హత్య చేసిన కేసుల్లో కోర్టు తీర్పునిచ్చింది. VKB జిల్లా పెద్దేముల్‌‌కు చెందిన భార్యభర్తలు కురువ స్వామి, నర్సమ్మ సంగారెడ్డిలో స్థిరపడ్డారు. కూలీ ఇప్పిస్తామని చెప్పి శివారు ప్రాంతానికి తీసుకెళ్లి మహిళలపై హత్యాచారం, దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనల్లో రంగారెడ్డి కోర్టు భర్తకు 10ఏళ్లు, భార్యకు 7ఏళ్లు, ఇదే తరహా కేసులో మరో ఏడాది జైలుశిక్ష విధించింది

News September 14, 2024

సికింద్రాబాద్: మహిళా సాధికారతపై స్పెషల్ కోర్స్

image

HYDలో ఉమెన్ ఎంపవర్మెంట్‌పై సికింద్రాబాద్లోని డిఫెన్స్ కాలేజీ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ప్రత్యేక కోర్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా మహిళా సాధికారత కోసం తీసుకున్న అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. డాక్టర్స్ సువర్ణ మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక భరోసాపై మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

News September 14, 2024

HYD: CM రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ..!

image

✓చర్లపల్లి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల నుంచి స్టేషన్ చేరుకునే అప్రోచ్ రోడ్లను అభివృద్ధి చేయాలి.
✓చర్లపల్లి పరిసర అటవీ శాఖ, పరిశ్రమల విభాగాల భూములు స్వాధీనం చేసుకోవాలి.
✓చర్లపల్లిలో పలు పరిశ్రమలను వేరే ప్రాంతానికి తరలించాలి.
✓మూసి డెవలప్మెంట్‌పై ఫోకస్ పెట్టి, బాధిత నిర్వాసితులకు భరోసా కల్పించాలి.
✓ఇంటింటికి చెత్త సేకరణ కోసం వీలైతే GIS, QR కోడ్ స్కానింగ్ సాంకేతికత ఉపయోగించండి.

News September 14, 2024

HYD: సెప్టెంబర్ 17న సెలవు.. ఆరోజు రావాల్సిందే!

image

గణేశ్ నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 17న మంగళవారం జంట నగరాలు HYD, సికింద్రాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఆ రోజున సెలవు ఇస్తుండటంతో నవంబర్ 9 రెండో శనివారం వర్కింగ్ డేగా ప్రకటించారు. అక్టోబర్‌లో దసరా సెలవులు ఉన్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

News September 14, 2024

HYDలో ట్రాఫిక్ ఆంక్షలు.. BIG ALERT

image

HYD సైబర్ టవర్స్ వద్ద సర్వీస్ రోడ్డు నిర్మిస్తుండటంతో SEP14 నుంచి 30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ✓మాదాపూర్ కల్లు దుకాణం నుంచి JNTU, ముసాపేట వెళ్లే వారు 100 ఫీట్ జంక్షన్, పర్వత్‌నగర్ నుంచి కైతలాపుర్ బ్రిడ్జి మీదుగా వెళ్లాలని పోలీసులు తెలిపారు.
✓సైబర్ టవర్స్ వంతెన కింద నుంచి N-గార్డెన్ హోటల్ వద్ద లెఫ్ట్ టర్న్- N-కన్వెన్షన్- జైన్‌ఎంక్లేవ్ రైట్‌టర్న్- యశోద హాస్పిటల్ వైపు వెళ్లాలి.

News September 14, 2024

కళాకారులను ప్రజాప్రభుత్వం అదుకొంటుంది

image

తెలంగాణలోని పేద కళాకారులను తమ ప్రజాప్రభుత్వం అన్నివిధాలా అదుకొంటుందన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. శారద కథలు బలగం సినిమాలో నటించిన పేదకళాకారులు కొమురమ్మ, మొగిలయ్యలకు తన జీతం నుంచి రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు. పొన్నం సత్తయ్యగౌడ్ 14వ వర్ధంతి సందర్భంగా పలువురికి ఆయన స్మారక అవార్డులను మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణ రావు అందజేశారు.

News September 14, 2024

HYDలో చదివి.. సుప్రీంకోర్టు ASGగా నియామకం!

image

రామంతపూర్ HYD పబ్లిక్ స్కూల్లో చదివిన 1987 బ్యాచ్ ఎస్.ద్వారకనాథ్ సుప్రీం కోర్టు అడిషనల్ సోలిసిటర్ జనరల్ (ASG)గా నియమితులయ్యారు. HYDలో చదివి సీనియర్ న్యాయమూర్తి స్థాయి నుంచి ASG స్థాయికి వెళ్లడం తమకు ఎంతో గర్వంగా ఉందని HPS బృందం, ద్వారకానాథ్ తెలియజేశారు. HYD పబ్లిక్ స్కూల్లో చదివిన అనేక మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ముఖ్య పదవుల్లో ఉన్న సంగతి తెలిసిందే.

News September 13, 2024

VKB: ఎయిడ్స్‌‌పై అవగాహన ఉండాలి

image

ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తాండూరు ప్రభుత్వ ఆస్పత్రి ఐసీటీసీ కౌన్సిలర్ పార్వతాలు సూచించారు. శుక్రవారం మండల పరిధి దేవనూరులో వైఆర్‌జీ కేర్ లింక్ వర్కర్స్ స్కీం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. సుఖ వ్యాధులతో ఎయిడ్స్ ప్రబలుతుందన్నారు. ఎయిడ్స్ బాధితుడితో మాట్లాడటం, కలిసి ఉండటం, భోజనం చేయడం వల్ల వ్యాధి సోకదన్నారు.

News September 13, 2024

గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ బందోబస్త్ ఏర్పాట్లపై నగర సీపీ సమీక్ష

image

HYD సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గురువారం సౌత్ ఈస్ట్ & ఈస్ట్ జోన్లలో పర్యటించారు. ఈనెల 17న జరగనున్న గణేశ్ నిమజ్జనం, 19న జరగనున్న మిలాద్ ఉన్ నబీ బందోబస్త్ ఏర్పాట్ల గురించి పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలీస్ అధికారులు మానసికంగా ఒత్తిడి లేకుండా విధులు నిర్వహించి శాంతి భద్రతలు కాపాడాలని అన్నారు. అలాగే వేడుకల్లో భాగంగా ట్రాఫిక్ సమస్యను నియంత్రించడం గురించి పలు సూచనలు చేశారు.