Chittoor

News April 18, 2026

సదుం: రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి

image

రోడ్డు ప్రమాదంలో సదుం మండలానికి చెందిన బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. చెరుకువారి పల్లెకి చెందిన ధరణి తమిళనాడు రాష్ట్రం మధురైలో బీటెక్ చదువుతున్నాడు. గత శనివారం అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు.

News April 18, 2026

కుప్పంలో మరో భారీ పరిశ్రమకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

image

గుడిపల్లి (M) కుప్పిగాని పల్లి, దాసిమానిపల్లి, అంగనామాల కొత్తూరు గ్రామాల పరిధిలో 105 ఎకరాల భూమిని NPSPL స్పెషాలిటీ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ప్రభుత్వం కేటాయించింది. రూ.2550 కోట్ల పెట్టుబడితో కాథోడ్ మెటీరియల్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 400 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ తయారీ పాలసీ (2025-30) కింద ఆమోదించింది

News April 18, 2026

చిత్తూరు: ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు

image

చిత్తూరు జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం 6 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. గంగవరంలో 41.2, రొంపిచెర్లలో 41.1, శ్రీరంగరాజపురంలో 40.1, తవణంపల్లెలో 40.9, విజయపురంలో 40.5, బంగారుపాళ్యంలో 40.0, నగరి, నిండ్రలో 39.8, పులిచెర్ల, శాంతిపురంలో 39.6 డిగ్రీల టెంపరేచర్ నమోదు అయ్యింది.

News April 17, 2026

బాల, బాలికలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించండి: కలెక్టర్

image

2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘బడి పిలుస్తోంది’ ప్రత్యేక ప్రవేశోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈనెల 17 నుంచి 23 వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. అర్హత గల బాల, బాలికలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. స్లమ్ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

News April 17, 2026

గంగ జాతరకు CM చంద్రబాబుకు ఆహ్వానం

image

కుప్పం శ్రీప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు సతీసమేతంగా రావాలంటూ CM చంద్రబాబుకు గంగమ్మ గుడి ఛైర్మన్ BMK రవిచంద్రబాబు ఆహ్వాన పత్రికను అందజేశారు. అమరావతిలో CMను ఆయన నివాసానికి వెళ్లి జాతర ఆహ్వాన పత్రిక ఇచ్చారు. గంగ జాతరలో భాగంగా మే 20న అమ్మవారి విశ్వరూప దర్శనం రోజు CM చంద్రబాబు దంపతులు రానున్నట్లు సమాచారం.

News April 17, 2026

612 కేసులు నమోదు: చిత్తూరు SP

image

విద్యా సంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ తుషార్ హెచ్చరించారు. 2025 జనవరి 1 నుంచి ఇప్పటివరకు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 612 కేసులు నమోదు చేసి రూ. 69,500 జరిమానా విధించినట్టు ఆయన శుక్రవారం వెల్లడించారు. విద్యా సంస్థలకు 100 మీటర్ల పరిధిలో సిగరెట్లు, ఖైనీ వంటి పొగాకు ఉత్పత్తులు విక్రయించరాదన్నారు.

News April 17, 2026

కుప్పంలో అక్రమ మైనింగ్… ఇకనైనా అడ్డుకట్ట పడేనా ..!

image

కుప్పం నియోజవర్గంలో అక్రమ మైనింగ్ పరంపర కొనసాగుతునే ఉంది. రాత్రుల్లో అధికారుల కళ్లుగప్పి అటు TNకు, ఇటు KAకు రూ.కోట్లు విలువ చేసే గ్రానైట్‌ను తరలించేస్తున్నారు. సీఎం సొంత నియోజకవర్గం కావడంతో అడపాదడపా తనిఖీలు చేస్తున్నారు. గ్రానైట్ అక్రమంగా తరలిపోతుందని, ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

News April 17, 2026

చిత్తూరు: మండుతున్న ఎండలు

image

జిల్లాలో వేసవితాపంతో ప్రజలు అల్లాడుతున్నారు. గురువారం రొంపిచెర్లలో 40.6, గంగవరంలో 40.4, శాంతిపురంలో 39.7, శ్రీరంగరాజపురం, విజయపురంలో 39.5, బంగారు పాళ్యం, నగరి, తవణంపల్లెలో 38.9, పులిచెర్లలో 38.4, పెద్దపంజాణిలో 38.3, పూతలపట్టు, చిత్తూరు రూరల్, నిండ్ర, చిత్తూరు అర్బన్ లో 38.2, పెనుమూరు, పాలసముద్రం, గుడిపాల, యాదమరిలో 37.9 డిగ్రీల టెంపరేచర్ నమోదు అయ్యింది.

News April 17, 2026

చిత్తూరు: మండుతున్న ఎండలు

image

జిల్లాలో వేసవితాపంతో ప్రజలు అల్లాడుతున్నారు. గురువారం రొంపిచెర్లలో 40.6, గంగవరంలో 40.4, శాంతిపురంలో 39.7, శ్రీరంగరాజపురం, విజయపురంలో 39.5, బంగారు పాళ్యం, నగరి, తవణంపల్లెలో 38.9, పులిచెర్లలో 38.4, పెద్దపంజాణిలో 38.3, పూతలపట్టు, చిత్తూరు రూరల్, నిండ్ర, చిత్తూరు అర్బన్ లో 38.2, పెనుమూరు, పాలసముద్రం, గుడిపాల, యాదమరిలో 37.9 డిగ్రీల టెంపరేచర్ నమోదు అయ్యింది.

News April 17, 2026

చిత్తూరు: వన్ టౌన్ సీఐ సస్పెండ్

image

వన్ టౌన్ సీఐ మహేశ్వరం సస్పెండ్ చేస్తూ అధికారులు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. బెట్టింగ్ నిర్వాహకుల నుంచి మామూళ్లు తీసుకోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. నిందితులను కేసు నుంచి తప్పించడంతోపాటు మరికొందరిని అరెస్టు చేస్తామని బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. గతంలోనూ గుట్కా వ్యాపారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.