News September 17, 2024

త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ: మాజీ ఎంపీ GV

image

AP: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా కలిసి వచ్చే వ్యక్తులు, సంఘాలతో కలిసి త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు మాజీ ఎంపీ GV హర్షకుమార్ ప్రకటించారు. రిజర్వేషన్ల వర్గీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరులో జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. పార్టీ నాయకుడు ఎవరనేది త్వరలో ప్రకటిస్తామని, రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు వర్గీకరణకు అనుకూలంగా ఉండడంతో కొత్త పార్టీ పెడుతున్నట్లు చెప్పారు.

News September 17, 2024

ఒకే వేదికపైకి రేవంత్, కేటీఆర్!

image

TG: ఒకరిపై మరొకరు నిత్యం తీవ్ర విమర్శలు చేసుకునే సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకే వేదికను పంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మరణించిన సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభను ఈనెల 21న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు కేటీఆర్‌కు ఆహ్వానం పంపామని, వారు పాల్గొంటారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు.

News September 17, 2024

భారత్vs చైనా.. నేడు ఫైనల్

image

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో వరుస విజయాలతో అదరగొట్టిన భారత పురుషుల హాకీ జట్టు ఇవాళ ఫైనల్‌లో చైనాను ఢీకొట్టనుంది. మధ్యాహ్నం 3.30కు మ్యాచ్ ప్రారంభం కానుంది. సోనీ స్పోర్ట్స్ టెన్-1 ఛానల్, సోనీ లివ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో దిగుతున్న టీమ్ ఇండియా ఐదో ట్రోఫీ సాధించాలని పట్టుదలగా ఉంది. అనూహ్యంగా ఫైనల్ చేరిన చైనా తొలి టైటిల్ కోసం ఆరాటపడుతోంది.

News September 17, 2024

గణేశ్ నిమజ్జనం.. మద్యం షాప్‌లు బంద్

image

TG: గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో HYD వ్యాప్తంగా ఇవాళ ఉదయం 6 గంటల నుంచే మద్యం షాప్‌లు క్లోజ్ అయ్యాయి. రేపు సాయంత్రం 6 వరకు వైన్స్, కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు మూసేయాలని పోలీస్ కమిషనర్ CV ఆనంద్ ఇప్పటికే ఉత్తర్వులిచ్చారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. స్టార్ హోటల్ బార్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లలో మాత్రం యథావిధిగా మద్యం అందుబాటులో ఉండనుంది.

News September 17, 2024

ఇవాళ సెలవు.. నవంబర్ 9న వర్కింగ్ డే

image

TG: గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఇవాళ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో సెలవు ఉండనుంది. ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలకు హాలిడే వర్తిస్తుంది. అయితే వర్షాలు, వరదల కారణంగా ఇప్పటికే పలు సెలవులు వచ్చినందున నవంబర్ 9న రెండో శనివారాన్ని వర్కింగ్ డేగా ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజు విద్యాసంస్థలు యథాతథంగా నడవనున్నాయి.

News September 17, 2024

రాజీవ్ విగ్రహంపై వివాదం.. నేడు రాష్ట్రంలో BRS ఆందోళనలు

image

TG: సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై BRS మండిపడుతోంది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయనుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు అన్ని నియోజకవర్గాలలో తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయనున్నాయి. రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుచేసి తెలంగాణ తల్లిని సీఎం రేవంత్ అవమానించారని కేటీఆర్ విమర్శిస్తున్నారు.

News September 17, 2024

ప్రభుత్వానికి 100 రోజులు.. రేపు NDA శాసనసభా పక్ష భేటీ

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన NDA శాసనసభా పక్ష సమావేశం రేపు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో జరగనుంది. ఈ భేటీకి dy.cm పవన్ కళ్యాణ్, BJP రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి హాజరయ్యే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతున్న నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, లోటుపాట్లపై చర్చించనున్నారు. ఈ నెల 20 నుంచి 26 వరకు ఎమ్మెల్యేలు ఇంటింటికీ వెళ్లి తమ పాలనను ప్రజలకు వివరించడంపై ఆలోచన చేస్తున్నారు.

News September 17, 2024

నేడే కేజ్రీవాల్ రాజీనామా.. కొత్త సీఎంపై సర్వత్రా ఉత్కంఠ

image

ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఇవాళ సాయంత్రం 4.30 గంట‌ల‌కు తన పదవికి రాజీనామా చేయనున్నారు. లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ వీకే స‌క్సేనాను క‌లిసి రాజీనామా పత్రాన్ని అందిస్తారు. దీంతో తదుపరి సీఎం ఎవరనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఆప్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ కేజ్రీవాల్ నివాసంలో స‌మావేశ‌మై చర్చించింది. అతిశీ, రాఘ‌వ్ చ‌ద్దా, సౌర‌భ్ భ‌ర‌ద్వాజ్‌, కైలాశ్ గ‌హ్లోత్ CM రేసులో ముందున్నారు.

News September 17, 2024

MBBS యాజమాన్య కోటా ఆప్షన్ల ఎంపికకు నోటిఫికేషన్

image

AP: ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 2024-25కు గాను యాజమాన్య కోటా(B, C) ఎంబీబీఎస్ సీట్ల ఆప్షన్ల ఎంపికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 19 రాత్రి 9 గంటల వరకు అవకాశం ఉంటుంది. 25 కాలేజీల్లో 1,914 సీట్లుండగా, B కేటగిరీలో 1,318, C(ఎన్నారై) కేటగిరిలో 596 సీట్లు ఉన్నాయి.
వెబ్‌సైట్: <>http://drntr.uhsap.in<<>>

News September 17, 2024

ఆత్మవిశ్వాసంలో కోహ్లీకి ఎవరూ సాటిరారు: సర్ఫరాజ్ ఖాన్

image

విరాట్ కోహ్లీ యంగ్ ప్లేయర్లకు ఎప్పుడూ అండగా ఉంటూ విలువైన సూచనలు ఇస్తుంటాడని సర్ఫరాజ్ ఖాన్ ప్రశంసించారు. క్రికెట్ పట్ల ప్యాషన్, ఆత్మవిశ్వాసంలో ఆయనకెవరూ సాటిరారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. IPLలో 2015-18 మధ్య RCB తరఫున కోహ్లీ కెప్టెన్సీలో ఆడిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయనతో కలిసి టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవాలనే తన కల భవిష్యత్తులో నిజమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.