News April 20, 2026

9,175 ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం

image

CRPFలో 9,175 కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. APలో 504, TGలో 356 పోస్టులున్నాయి. టెక్నికల్, ట్రేడ్స్‌మెన్, పయనీర్ విభాగాల్లో ఖాళీలున్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, సంబంధిత విభాగంలో ITI పాసైన వారు అర్హులు. వయసు 18-23 ఏళ్లు ఉండాలి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మే 19.
వెబ్‌సైట్: <>https://www.rect.crpf.gov.in<<>>

News April 20, 2026

చంద్రబాబుకు మోదీ, రేవంత్, చిరు బర్త్‌డే విషెస్

image

ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, YS జగన్, మెగాస్టార్ చిరంజీవి తదితర ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కష్టపడి పని చేసే ఏపీ సీఎం, ఆప్తమిత్రుడు చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని మోదీ ట్వీట్ చేశారు. ‘మీ దూరదృష్టి, పట్టుదల, ప్రజల పట్ల ఉన్న అంకితభావం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం’ అని చిరంజీవి పేర్కొన్నారు.

News April 20, 2026

హార్ట్ బ్రేక్స్.. 4 నెలలు నిద్రలేమితో బాధపడ్డా: కల్కి కోచ్లిన్

image

తాను జీవితంలో మానసికంగా, శారీరకంగా ఎన్నో ఇబ్బందులు పడ్డానని బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌ మాజీ భార్య కల్కి కోచ్లిన్ వెల్లడించారు. ‘హార్ట్ బ్రేక్స్ కారణంగా 4 నెలలపాటు నిద్రలేమితో బాధపడ్డాను. 2-3AMకే మేల్కొని నిద్రరాక గిటార్ వాయించేదాన్ని. దీంతో నా డైలీ రొటీన్, వర్క్ లైఫ్ గందరగోళంగా మారింది. ఒక్కోసారి నేను మెలకువలో ఉన్నానో, కలలో ఉన్నానో తెలిసేది కాదు’ అని ఈ ఫ్రెంచ్ నటి చెప్పారు.

News April 20, 2026

తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రా. పసిడి రూ.490 తగ్గి రూ.1,55,290 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రూ.450 తగ్గి రూ.1,42,350కి చేరింది.

News April 20, 2026

ఇక నుంచి యాక్టివ్‌గా కేసీఆర్!

image

TG: నేడు జగిత్యాలలో జరిగే బహిరంగ సభతో కేసీఆర్ పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వనున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల (2024) తర్వాత కేసీఆర్ ప్రజల మధ్యకు రాలేదు. అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరుకావడం లేదు. దీంతో నేడు జరగబోయే సభ రాజకీయంగా కీలకంగా మారనుంది. కేసీఆర్ ఇక నుంచి యాక్టివ్ అవుతారని, ప్రభుత్వ వైఫల్యాలపై నేటి సభలో విరుచుకుపడతారని గులాబీ వర్గాలు చెబుతున్నాయి. మరి కేసీఆర్ ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తారో చూడాలి.

ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ట్రేడింగ్‌ను ఫ్లాట్‌గా ప్రారంభించాయి. సెన్సెక్స్ ప్రస్తుతం 118 పాయింట్ల స్వల్ప లాభంతో 78,612కు చేరగా నిఫ్టీ 24,371 వద్ద ట్రేడవుతోంది. రూపాయి విలువ 9 పైసలు ఎగిసి ఒక డాలరుకు 92.82గా కొనసాగుతోంది. ట్రెంట్, SBI, ICICI బ్యాంక్, యాక్సిక్ బ్యాంక్ షేర్లు సెన్సెక్స్ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. ఇరాన్-US చర్చలపై క్లారిటీ లేకపోవడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

News April 20, 2026

మోదీ స్ఫూర్తితో పుంగనూరు ఆవు కొన్నాడు!

image

ప్రధాని మోదీ స్ఫూర్తితో యూపీలోని సహరన్‌పుర్‌లో రాజేంద్ర అనే వ్యక్తి పుంగనూరు ఆవులను కొని పెంచుతున్నాడు. ఈ బ్రీడ్‌ను స్థానికంగా పాపులర్ చేయడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ పుంగనూరు ఆవులను పెంచడం చూసి తనకు ఈ ఆలోచన వచ్చిందన్నారు. ₹4లక్షల ఖరీదు చేసే ఈ ఆవు పాల ధర లీటరుకు ₹2వేలు పలుకుతోందని తెలిపారు. కాగా ఏపీలోని చిత్తూరుకు చెందిన ఈ అరుదైన బ్రీడ్‌ ఆవులను మోదీ నివాసంలో పెంచుతున్నారు.