News October 13, 2024

పూరీ ఆలయంలో భక్తులకు ఉచితంగా ప్రసాదం!

image

పూరీ జ‌గ‌న్నాథుడి ఆల‌యంలో భ‌క్తుల‌కు ఉచితంగా మ‌హాప్ర‌సాదాన్ని పంపిణీ చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం యోచిస్తోంది. దీనిపై త్వ‌ర‌లోనే నిర్ణయం తీసుకుంటామ‌ని మంత్రి పృథ్వీరాజ్ తెలిపారు. దీని వ‌ల్ల ఏటా ₹14-15 కోట్ల భారం ప‌డుతుంద‌న్నారు. అయితే, ఉచితంగా ప్ర‌సాదం పంపిణీకి విరాళాలు ఇవ్వ‌డానికి కొంత మంది భ‌క్తులు ముందుకొచ్చిన‌ట్టు వెల్లడించారు. కార్తీక మాసం తరువాత అమలు చేసే అవకాశం ఉన్నట్టు మంత్రి తెలిపారు.

News October 13, 2024

రేపు మద్యం దుకాణాలకు లాటరీ

image

AP: రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు 89,882 దరఖాస్తులు అందాయి. రూ.2లక్షల నాన్ రిఫండబుల్ ఫీజుతో ఖజానాకు రూ.1,797 కోట్ల ఆదాయం లభించింది. అనంతపురం జిల్లాలో 12 దుకాణాలకు అతి తక్కువ దరఖాస్తులు రావడంతో దరఖాస్తులను మళ్లీ పరిశీలించాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. రేపు లాటరీ పద్ధతిలో షాపులు కేటాయిస్తారు. ఎల్లుండి ప్రైవేట్ వ్యక్తులకు దుకాణాలు అప్పగిస్తారు. 16 నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి వస్తుంది.

News October 13, 2024

PM గతిశక్తి ఓ గేమ్ ఛేంజర్: మోదీ

image

రైల్వే నుంచి విమానాశ్ర‌యాల వ‌ర‌కు 7 కీల‌క రంగాల స‌మ్మిళిత వృద్ధి ల‌క్ష్యంగా ‘PM గ‌తిశ‌క్తి’ దేశ మౌలిక స‌దుపాయాల రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పులు తెచ్చింద‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. మల్టీమోడల్ కనెక్టివిటీ పెరిగి వివిధ రంగాల్లో స‌మ‌ర్థ‌వంత‌మైన పురోగ‌తికి తోడ్ప‌డిందన్నారు. ర‌వాణా వ్య‌వ‌స్థ‌ మెరుగుప‌డి ఆల‌స్యం తగ్గింద‌ని, త‌ద్వారా ఎంతో మంది కొత్త అవ‌కాశాల‌ను అందిపుచ్చుకున్నార‌ని మోదీ పేర్కొన్నారు.

News October 13, 2024

ఉద్యోగంలో చేరిన మొద‌టి రోజే రాజీనామా

image

శ్రేయ‌స్ అనేక ప్రొడ‌క్ట్ డిజైన‌ర్ వ‌ర్క్‌ఫ్రం హోం కార‌ణంగా ఓ సంస్థ‌లో త‌క్కువ జీతానికి చేరారు. మొద‌టి రోజే 9 గంట‌లు కాకుండా 12-14 గంట‌లు ప‌నిచేయాల‌ని, అది కూడా కాంపెన్సేష‌న్ లేకుండా చేయాల‌ని మేనేజర్ ఆదేశించార‌ట‌. పైగా వ‌ర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఓ ఫ్యాన్సీ పదమని తీసిక‌ట్టుగా మాట్లాడ‌డంతో శ్రేయ‌స్ ఉద్యోగంలో చేరిన మొద‌టి రోజే రాజీనామా చేశారు. ఆ మెయిల్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయ‌డంతో వైర‌లైంది.

News October 13, 2024

బాహుబలి-2ను దాటేసిన దేవర

image

తెలుగు రాష్ట్రాల్లో 16వ రోజు కలెక్షన్ల షేర్‌లో బాహుబలి-2 రూ.3.50 కోట్లతో అగ్రస్థానంలో ఉండేది. ఆ రికార్డును ఎన్టీఆర్ ‘దేవర’ దాటేసింది. 16వ రోజున రూ.3.65కోట్లు వసూలు చేసింది. ఈ జాబితాలో తర్వాతి మూడు స్థానాల్లో హను-మాన్(రూ.3.21కోట్లు), RRR (రూ.3.10కోట్లు), F2(రూ.2.56 కోట్లు) ఉన్నాయి. గత నెల 27న విడుదలైన ‘దేవర’ తాజాగా రూ.500 కోట్ల వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.

News October 13, 2024

ఉపాధి హామీ పనుల ప్రభావంపై అధ్యయనం

image

క్షేత్ర‌స్థాయిలో ఉపాధి హామీ ప‌థకం ప‌నితీరు, దాని ప్ర‌భావంపై అధ్య‌య‌నం చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు నీతి ఆయోగ్ DMEO శాఖ అధ్యయ‌నానికి బిడ్లు ఆహ్వానించింది. వివిధ ద‌శ‌ల్లో క‌న్స‌ల్టెంట్ల‌ను ఎంపిక చేస్తారు. క్షేత్ర‌స్థాయిలో ఇంటింటి స‌ర్వే ద్వారా గ‌త ఐదు ఆర్థిక సంవత్స‌రాల్లో జ‌రిగిన ప‌నుల ప్ర‌భావంపై క‌న్స‌ల్టెంట్ అధ్యయనం చేసి ఆరు నెలల్లోపు నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.

News October 13, 2024

2025లో మెగా అభిమానులకు పండుగే పండుగ!

image

2025 మెగా అభిమానులకు కనుల పండుగ కానుంది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ సినిమాలు నెలల వ్యవధిలో రిలీజ్ కానుండటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. జనవరి 10న చెర్రీ గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుండగా, మార్చి 28న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, చిరు విశ్వంభర కూడా ఏప్రిల్‌లో రిలీజయ్యే ఛాన్సుంది.

News October 13, 2024

ప్రభుత్వ లాంఛనాలతో సిద్దిఖీ అంత్యక్రియలు

image

MH మాజీ మంత్రి బాబా సిద్దిఖీ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని CM ఏక్‌నాథ్ షిండే ఆదేశించారు. సిద్దిఖీ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యింది. అనంతరం మృతదేహాన్ని బాంద్రాలోని సిద్దిఖీ నివాసానికి తరలించారు. ఆదివారం రాత్రి 8.30 గంటలకు ముంబై లైన్స్‌లోని బడా ఖబ్రస్థాన్‌లో సిద్దిఖీ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. బాధిత కుటుంబాన్ని పలు పార్టీల నేతలు పరామర్శిస్తున్నారు.

News October 13, 2024

రేపు స్కూళ్లకు సెలవు ఉందా?

image

తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు దసరా సెలవులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఏపీలో స్కూళ్లకు సెలవులు ఇవాళ్టితో ముగియనుండగా, రేపు బడులు తెరుచుకుంటాయి. ఇక TGలో రేపు కూడా సెలవు ఉండగా, ఎల్లుండి నుంచి స్కూళ్లు పున:ప్రారంభం కానున్నాయి. అటు తెలంగాణలోని జూనియర్ కాలేజీలు రేపటి నుంచి ప్రారంభం అవుతాయి.

News October 13, 2024

త‌న పుస్త‌కంలో మోదీ గురించి రాసుకున్న బోరిస్ జాన్స‌న్

image

UK EX-PM బోరిస్ జాన్స‌న్ రాసిన ‘అన్‌లీష్డ్’ పుస్త‌కంలో PM మోదీపై ప్ర‌శంస‌లు కురిపించారు. దౌత్యపరంగా, వ్యక్తిగతంగా మోదీ నిజమైన స్నేహితులని పేర్కొన్నారు. మోదీని మార్పులు తీసుకొచ్చే వ్యక్తిగా అభివ‌ర్ణించిన బోరిస్ మొద‌టిసారి ఆయ‌న్ను క‌లిసిన‌ప్పుడు ఉత్సుక‌త‌తో కూడిన శ‌క్తిని అనుభూతి చెందానన్నారు. భార‌త్‌తో ఘ‌న‌మైన బంధాన్ని క‌లిగి ఉన్నామ‌ని, త‌న హ‌యాంలోనే స్వేచ్ఛా వాణిజ్యానికి పునాది వేశామ‌న్నారు.