News July 18, 2024

అంకాపూర్ చికెన్ తినిపిస్తావా.. బోధన్ రైతుతో CM రేవంత్

image

అంకాపూర్ చికెన్ తినిపిస్తావా? లేదా? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన యువ రైతు రవిని అడిగారు. రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో కలిసి రైతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రవితో మాట్లాడుతూ.. చికెన్ గురించి అడిగారు.

Similar News

News December 1, 2024

ఆర్మూర్: వ్యవసాయ పనులకు వెళ్తూ మృత్యువాత

image

వ్యవసాయ పనులకు వెళ్తూ ఓ రైతు మృత్యువాత పడిన విషాద ఘటన ఇది. పెర్కిట్‌కు చెందిన శ్రీరాం అశోక్ (55) ఆదివారం ఉదయం వ్యవసాయ పనుల కోసం బైక్‌పై వెళ్తుండగా హైదరాబాద్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం జాతీయ రహదారిపై రిలయన్స్ పెట్రోల్ పంప్ సమీపంలో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అశోక్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆర్మూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News December 1, 2024

NZB: హత్య కేసులో ఇద్దరు అరెస్ట్

image

నిజామాబాద్‌లో జరిగిన ఓ వ్యక్తి హత్య కేసులో ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు 1 టౌన్ SHO రఘుపతి తెలిపారు. సంతోష్ నగర్‌కు చెందిన వాస్టర్ రాజేశ్ ఈ నెల 25న ముస్తాయిద్ పుర చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా మృతి చెందాడు. విచారణ చేపట్టిన పోలీసులు రాజు రాంజీ బీమాల్వాడి, షేక్ సికందర్ మద్యం మత్తులో రాజేశ్‌ను హత్య చేసినట్లు గుర్తించారు. కాగా వారిని శనివారం రిమాండ్‌కు తరలించినట్లు SHO వెల్లడించారు.

News December 1, 2024

నేడు కామారెడ్డిలో పర్యటించనున్న ఎంపీ, షబ్బీర్ అలీ

image

కామారెడ్డిలో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేశ్ షెట్కార్  పర్యటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకుడు గంగాధర్ తెలిపారు. మొదటగా పట్టణంలోని జయశంకర్ కాలనీలో ఓంకారేశ్వర ఆలయంలో నిర్వహించే పూజలలో పాల్గొంటారని, అనంతరం ఎస్సీ, ఎస్టీ టీచర్స్ యూనియన్ మహాసభలకు హాజరవుతారని పేర్కొన్నారు.