News January 3, 2025
అంకితభావంతో పనిచేయాలి: GHMC కమిషనర్
నగర అభివృద్ధికి ఉద్యోగులకు అంకితభావంతో పనిచేసి ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని GHMC కమిషనర్ ఇలంబర్తి ఉద్యోగులకు సూచించారు. ఈ మేరకు నూతన సంవత్సరం సందర్భంగా ఖైరతాబాద్‌లోని GHMC ప్రధాన కార్యాలయంలో కమిషనర్‌ను జోనల్ కమిషనర్లు, వివిధ విభాగాల హెచ్వోడీలు, కార్పొరేటర్లు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని సంకల్పంతో పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Similar News
News January 8, 2025
సికింద్రాబాద్: స్పోర్ట్స్ కోటాలో రైల్వే ఉద్యోగాలు
SCRలో ఉద్యోగం చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్. స్పోర్ట్స్ కోటా కింద రైల్వే రిక్రూట్మెంట్ సెల్ దరఖాస్తులు స్వీకరిస్తోంది. సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్స్‌లో 31, సికింద్రాబాద్ డివిజన్లో 5, హైదరాబాద్-5, విజయవాడ-5, గుంటూరు-5 నాందేడ్-5, గుంతకల్‌లో 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత: 10th, ఇంటర్, ITI ఉత్తీర్ణత. వయస్సు: 18 నుంచి 25. అప్లై చేసేందుకు చివరి తేదీ: ఫిబ్రవరి 03, 2025.
SHARE IT
News January 8, 2025
HYD: లవర్స్ సజీవదహనం (UPDATE)
ఘట్కేసర్ PS పరిధి ORR సర్వీస్ రోడ్డుపై కారు దగ్ధం ఘటనలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. చనిపోయే ముందు శ్రీరామ్(25) ఫోన్ నుంచి అమ్మాయి(17) వాట్సాప్‌లో లైవ్ లొకేషన్‌తో పాటు 3 పేజీల లెటర్‌ను ఆమె తండ్రికి సెండ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అంతకుముందే అన్నోజిగూడలోని ఓ దుకాణంలో పెట్రోల్ కొనుగోలు చేసినట్లు తెలిసింది. బాలిక తండ్రి వారున్న లొకేషన్ వెళ్లేసరికి కూతురు, శ్రీరామ్ మంటల్లో <<15087962>>సజీవదహనమయ్యారు<<>>.
News January 8, 2025
HYDలో ఒకేసారి పూసిన 92 పువ్వులు
అరుదుగా కనిపించే బ్రహ్మ కమలాలు ఒకేసారి 92 వికసించాయి. మణికొండ మున్సిపాలిటీ పుప్పాలగూడలోని ధనలక్ష్మి రమణమూర్తి ఇంట్లో చెట్టుకు ఈ అద్భుతం జరిగింది. ఒకే రోజు పదుల సంఖ్యలో పూలు పూయడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఏడాదికి ఒకేసారి పూసే బ్రహ్మకమలాలు విరివిగా పూయడం విశేషం.