News January 3, 2025

అంకితభావంతో పనిచేయాలి: GHMC కమిషనర్ 

image

నగర అభివృద్ధికి ఉద్యోగులకు అంకితభావంతో పనిచేసి ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని GHMC కమిషనర్ ఇలంబర్తి ఉద్యోగులకు సూచించారు. ఈ మేరకు నూతన సంవత్సరం సందర్భంగా ఖైరతాబాద్‌లోని GHMC ప్రధాన కార్యాలయంలో కమిషనర్‌ను జోనల్ కమిషనర్లు, వివిధ విభాగాల హెచ్‌వోడీలు, కార్పొరేటర్లు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని సంకల్పంతో పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 

Similar News

News January 15, 2025

ప్రజాపాలన కాదు.. ప్రతీకార పాలన: హరీశ్ రావు

image

సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలన పగా, ప్రతీకారంతోనే కొనసాగిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. పోలీసులను సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు, బెయిల్ వ్యవహారంపై ఇవాళ ఉదయం హైదరాబాద్ కోకాపేటలో హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డికి బెయిల్ రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

News January 14, 2025

HYD: నేడే ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు

image

AICC నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొననున్నారు. రేపు, ఎల్లుండి ఢిల్లీలోనే సీఎం, మంత్రులు బస చేయనున్నారు. ఢిల్లీ నుంచే వారం రోజుల పాటు సింగపూర్, దావోస్ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, అధికారులతో పర్యటించనున్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా వెళ్లనున్నారు.

News January 14, 2025

HYDలో గణనీయంగా తగ్గిన విద్యుత్ వాడకం

image

సంక్రాంతి పండుగ సందర్భంగా నగరవాసులు పల్లెటూర్లకు తరలివెళ్లారు. దీంతో గృహాలతో పాటు కార్యాలయాల్లో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పడిపోయింది. ఉత్పత్తులు, రోజువారి కార్యకలాపాలు నిలిచిపోవడంతో వినియోగం గణనీయంగా తగ్గింది. సోమవారం 2,500 మెగావాట్లకు పడిపోయింది. సాధారణ రోజులతో పోలిస్తే 700 మెగావాట్ల విద్యుత్ వినియోగం తగ్గిందని అధికారలు తెలిపారు.