News February 28, 2025
అంకెల గారడీ.. అమలు శూన్యం: తిరుపతి MP

రాష్ట్ర బడ్జెట్పై తిరుపతి ఎంపీ గురుమూర్తి తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ బడ్జెట్ వలన ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని MP మండిపడ్డారు. ‘పిట్ట కొంచెం కూత ఘనం’ అనిపించేలా బడ్జెట్ ఉందని విమర్శించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు నిధుల కేటాయింపులో కోత పడుతుందనే వాస్తవాలను ఈ బడ్జెట్ చెప్పకనే చెబుతుందని MP అన్నారు.
Similar News
News November 13, 2025
సూర్యాపేట: వేతనాలు విడుదల చేయాలి: పీఆర్టీయూ

2008 డీఎస్సీ కాంట్రాక్టు ఉపాధ్యాయుల వేతనాలు చెల్లించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు తంగేళ్ల జితేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం సూర్యాపేట జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ఉపాధ్యాయ వేతనాల విడుదలకు డైరెక్టరేట్ నుంచి విడుదలైన జీవోను డీటీఓకు అందజేశారు. ఎస్టీఓలకు ఆదేశాలు జారీ చేసి వేతనాలు విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ అధ్యక్షుడు గోదేశి దయాకర్, ఫోరం అధ్యక్షుడు కోట రమేష్ పాల్గొన్నారు.
News November 13, 2025
నవాబుపేట: వ్యక్తిని చంపి కాల్చేశారు

MBNR జిల్లా నవాబుపేట మండలం యన్మన్గండ్ల గేటు వద్ద గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. గేటు పరిసర ప్రాంతాలలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని హత్య చేసి కాల్చడంతో పూర్తిగా గుర్తుపట్టలేని విధంగా తయారైంది. ఈ హత్య ఘటన పరిసర ప్రాంతాలలో చర్చనీయాంశంగా మారింది.
News November 13, 2025
కరీంనగర్: నవంబర్ 15న ప్రత్యేక లోక్ అదాలత్

జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 15న ప్రత్యేక లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ కె. రాణి తెలిపారు. ఈ అదాలత్లో క్రిమినల్, సివిల్, చెక్ బౌన్స్, మోటార్ ప్రమాద పరిహార వంటి కేసులు ఇరుపక్షాల రాజీతో పరిష్కరించబడతాయని చెప్పారు. రాజీపడదగిన వారు సంబంధిత పోలీసు వారిని సంప్రదించాలని ఆమె సూచించారు.


