News August 23, 2025

అంగన్‌వాడీలకు శాశ్వత భవనాలు ఎప్పుడో?

image

జోగులాంబ గద్వాల జిల్లాలో 207 అంగన్‌వాడీ కేంద్రాలు సరైన భవనాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నాయి. ఇందులో ఎక్కువ కేంద్రాలు శిథిలావస్థకు చేరిన పాఠశాలలు, గ్రామ పంచాయతీలు, కమ్యూనిటీ భవనాల్లో నడుస్తున్నాయి. కొన్ని కేంద్రాలు ప్రైవేట్ భవనాల్లో అద్దెకు నిర్వహిస్తున్నారు. ‘పనుల జాతర-2025’ సందర్భంగా అంగన్‌వాడీలకు శాశ్వత భవనాలను నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులను కోరుతున్నారు.

Similar News

News March 6, 2026

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

* నాగాయలంక: 18 నెలల పసికందును కాటేసిన పాము
వీరవల్లి: ల్యాబ్ అసిస్టెంట్‌పై దాడి ఘటనలో విద్యార్థులకు కౌన్సెలింగ్
* విజయవాడ: OLX పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
* విజయవాడలో బైక్ స్టంట్స్ చేస్తున్న యువకులకు కౌన్సెలింగ్
* విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా కుంబాభిషేకం
* అసెంబ్లీ పాయింట్ వద్ద మాట్లాడిన గన్నవరం ఎమ్మెల్యే

News March 6, 2026

అంధుల పాఠశాల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

image

ఖమ్మం జడ్పీ సెంటర్‌లోని నిజాంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో నిర్మిస్తున్న అంధుల ప్రత్యేక పాఠశాల పనులను శుక్రవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తనిఖీ చేశారు. భవన నాణ్యత, తరగతి గదులు, టాయిలెట్స్, ప్రవేశ మార్గాలు, భద్రతా సదుపాయాలను పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అంధ విద్యార్థులకు బ్రెయిల్ లిటరసీ డివైస్, ఆడియో పాఠాల సదుపాయం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

News March 6, 2026

కృష్ణా: గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన

image

కృష్ణా జిల్లా వ్యాప్తంగా రెండో పంటైన అపరాల సాగు కోత పనులు ఊపందుకున్నాయి. అయితే అపరాల సాగు ప్రారంభ దశలో వాతావరణ పరిస్థితులు అనుకూలించక తెగుళ్లు వ్యాపించి పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా అపరాలు విక్రయాలు చేద్దామన్న మద్దతు ధర లేక రైతులు సిండికేట్‌గా మారిన దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.