News August 29, 2024

అంగన్వాడీలో కుళ్లిన గుడ్లు ఇస్తే కఠిన చర్యలు: మంత్రి సీతక్క

image

అంగన్వాడి కేంద్రాల్లో కుళ్లిన గుడ్లు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క హెచ్చరించారు. సంక్షేమ శాఖ కమిషనర్ కరుణతో కలిసి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ గురువారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాల్లో లబ్ధిదారులకు గ్యారెంటీ సరుకులను మాత్రమే సరఫరా చేయాలని చెప్పారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి లలితకుమారి, సిడిపివోలు పాల్గొన్నారు.

Similar News

News September 10, 2024

దుబ్బాక: ఆస్తి విషయంలో తండ్రితో గొడవ.. కొడుకు సూసైడ్

image

దుబ్బాక మండలం పెద్దగుండవెల్లిలో ఆస్తి పంపకాల విషయంలో తండ్రితో గొడవపడి కొడుకు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉమ్మడి ఆస్తిగా ఉన్న ఆరు ఎకరాల వ్యవసాయ భూమి పంపకం చేయాలని తండ్రి వెంకయ్యతో కొడుకు గంట బాలయ్య(39) 3న గొడవపడ్డాడు. పెద్దల సమక్షంలో రిజిస్ట్రేషన్ చేయిస్తానని తండ్రి చెప్పడంతో ఇంట్లోకి వెళ్లి గడ్డి మందు గుళికలు మింగాడు. చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందినట్లు ఎస్సై గంగరాజు తెలిపారు.

News September 10, 2024

ప్రజ్ఞాపూర్: నిమజ్జనం లేని గణపతికి నిత్య పూజలు

image

సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌లోని పురాతన ఆలయంలో మహాగణపతి నిత్య పూజలు అందుకుంటూ ఒక ప్రత్యేకత సంతరించుకున్న దేవాలయం. ప్రజ్ఞాపూర్ లో మహా గణపతి విగ్రహం స్వయంభుగా కొలువైన ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉందని స్థానికులు తెలుపుతున్నారు. నవరాత్రి వేడుకల్లో భాగంగా ప్రతిరోజు గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

News September 10, 2024

సంగారెడ్డి: కరాటే శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

లక్ష్మీబాయి రక్ష ప్రశిక్షణ పేరుతో పాఠశాలలో అమలు చేయనున్న కరాటే శిక్షణ కోసం ఈనెల 16 వరకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. ఎంపికైన వారు పాఠశాలల్లో బాలికలకు కరాటే శిక్షణ నేర్పించాల్సి ఉంటుందని చెప్పారు. పూర్తి వివరాలకు సంగారెడ్డి కలెక్టరేట్ లోని సమగ్ర శిక్ష కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు.