News March 21, 2025
అంగన్వాడీల్లో పిల్లలను సొంతపిల్లల్లా చూసుకోవాలి: అనిత రామచంద్రన్

అంగన్వాడి పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని మహిళా శిశు సంక్షేమం దివ్యాంగ వయోవృద్ధుల శాఖ ప్రధాన కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు. గురువారం వికారాబాద్ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, పిల్లల అంగవైకల్యం తదితర అంశాలపై సిడిపిఓలు, సూపర్ వైజర్లు సఖీ ఐసిపిఎస్ అధికారులు, సిబ్బందితో ప్రధాన కార్యదర్శి సమావేశం నిర్వహించారు.
Similar News
News January 5, 2026
అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: కృత్తికా శుక్లా

పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి అందిన ఫిర్యాదులకు త్వరితగతిన మోక్షం కలిగించాలని కలెక్టర్ కృత్తికా శుక్లా అధికారులను ఆదేశించారు. నరసరావుపేటలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన అర్జీల స్వీకరణలో ఆమె పాల్గొన్నారు. DRO మురళి, RDO మధులతలతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల వినతులను స్వయంగా స్వీకరించారు. సమస్యలను సంబంధిత శాఖల అధికారులకు అర్జీలను బదిలీ చేస్తూ, నిర్ణీత కాలవ్యవధిలోగా పరిష్కారం చూపాలన్నారు.
News January 5, 2026
మహ్మద్ సిరాజ్ అన్‌లక్కీ: డివిలియర్స్

మహ్మద్ సిరాజ్ కెరీర్‌పై SA మాజీ క్రికెటర్ AB డివిలియర్స్ స్పందించారు. ‘సిరాజ్ తిరిగి ODI జట్టులోకి రాగలిగాడు. కానీ అతను అన్‌లక్కీ. T20 వరల్డ్ కప్‌కి ఎంపిక కాలేదు. సెలక్టర్స్ టీమ్ బ్యాలన్స్‌పైనే ఫోకస్ చేశారు. సీమర్స్‌పై ఆధారపడకుండా స్పిన్నర్లకు ప్రాధాన్యమిచ్చారు. బుమ్రా, అర్ష్‌దీప్ జట్టులో ఉన్నారు. బ్యాటింగ్ చేయగలడని హర్షిత్ రాణాకు కూడా అవకాశమిచ్చారు’ అని తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నారు.
News January 5, 2026
సంగారెడ్డి: ‘వైద్యశాఖలో ఖాళీలు భర్తీ చేయండి’

సంగారెడ్డి జిల్లా వైద్యశాఖలో ఖాళీగా ఉన్న నర్సింగ్ ఆఫీసర్, కాంటింజెంట్ వర్కర్ల పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ సోమవారం కలెక్టర్ ప్రావీణ్యకు వినతిపత్రం అందజేశారు. సిబ్బంది కొరత కారణంగా ఉన్న వారిపై పనిభారం విపరీతంగా పెరుగుతోందని, దీంతో రోగులకు సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్.. ఖాళీల భర్తీకి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


