News June 25, 2024
అంగన్వాడీల్లో పూర్వ ప్రాథమిక విద్య ప్రారంభానికి చర్యలు: కరుణ

అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ సూచించారు. ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా వాల్ పెయింటింగ్స్, తాగునీరు, టాయిలెట్, వసతులు కల్పించాలన్నారు. జులై మొదటి వారం నాటికి అంగన్వాడీ టీచర్లకు పూర్వ ప్రాథమిక విద్య బోధనపై శిక్షణ పూర్తి చేయాలన్నారు.
Similar News
News October 29, 2025
కరీంనగర్: పత్తి రైతులకు శుభవార్త..!

కరీంనగర్ జిల్లాలోని పత్తి రైతులకు 6 జిన్నింగ్ మిల్లులో సీసీఐ పత్తి కొనుగోళ్లు ప్రారంభించిందని జిల్లా మార్కెటింగ్ అధికారి యం.డి షాహబోద్ధిన్ తెలిపారు. 1. శక్తి మురుగన్ ఇండస్ట్రీ, జమ్మికుంట ఎలబోతారం, 2. వైభవ్ కాటన్ కార్పోరేషన్ 3. నరసింహ కాటన్ జిన్మింగ్ 4.సరిత కాటన్ ఇండస్ట్రీస్ 5. సీతారామ కాటన్ ఇండస్ట్రీ 6. కావేరి జిన్నింగ్ మిల్లు, వెలిచాల. రైతులు కాపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు.
News October 29, 2025
జమ్మికుంట: మార్కెట్కు 4 రోజులు సెలవులు

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్కు 4 రోజులు సెలవులు ప్రకటించామని మార్కెట్ ఛైర్ పర్సన్ పుల్లూరి స్వప్న, ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం తెలిపారు. తుఫాన్ కారణంగా ఖరీదారులు, అడ్తిదారుల విన్నపం మేరకు ఈనెల 30, 31, NOV 1న మార్కెట్ యార్డుకు మూడు రోజులు సెలవు, ఆదివారం సాధారణ సెలవు ఉంటుందని పేర్కొన్నారు. CCI ద్వారా యధావిధిగా క్రయవిక్రయాలు జరుగుతాయని పేర్కొన్నారు. రైతులు, వ్యాపారులు, కార్మికులు గమనించాలన్నారు.
News October 29, 2025
‘ప్రభుత్వ సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలి’

ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు బాధ్యతాయుతంగా వ్యవహరించి, ప్రజలకు నిష్పక్షపాతంగా సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ సేవల్లో నిజాయితీ పెంచాలని, ప్రతి ఉద్యోగికి తన పనిలో జవాబుదారీతనం ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు.


